Pranitha Subhash: నటి ప్రణీత పెళ్లి ఫోటోలు వైరల్!

తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ ప్రణీత్ సుభాష్ సైలెంట్ గా పెళ్లి చేసేసుకుంది. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పెళ్లి వార్త కూడా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత శుక్రవారం ప్రణీత వివాహం జరిగినట్లు సన్నిహితులు వెల్లడించారు. బెంగుళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని ఆమె వివాహం చేసుకుంది.

ఈ పెళ్లి విషయాన్ని నితిన్ రాజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేయడంతో వార్తలు గుప్పుమన్నాయి. ప్రణీత, నితిన్ ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి ఈ జంట తమ పెళ్లిని వైభవంగా జరుపుకోవాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా సింపుల్ గా చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇది ప్రేమ పెళ్లా..? లేక పెద్దలు కుదిర్చిన సంబంధమా..? అనే విషయంలో క్లారిటీ లేదు.

ఇక ప్రణీత కెరీర్ విషయానికొస్తే.. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘హంగామా 2’ ‘భుజ్’ లాంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఆమె పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది.

1

2

3

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus