ఈ లాక్ డౌన్ టైములో సోనూ సూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎంతో మంది వలస కూలీలను వారి గమ్యస్థాలాలకు చేర్చాడు. వారికి అన్నం పెట్టాడు. పేద రాతులకు అవసరమైన పరికరాలు ఉచితంగా అందించాడు. ‘జనతా గ్యారేజ్’ సినిమాలో హీరోలు కష్టం అంటే పరిగెత్తుకుని వెళ్లి.. జనాల కష్టాలు తీర్చినట్టు.. సోనూసూద్ కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటానని తన సోషల్ మీడియాలో ఏకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసాడు. సోనూ సూద్ అంత కాకపోయినా..
ఆ స్థాయిలో జనాలకు సాయపడిన వారిలో హీరోయిన్ ప్రణీత కూడా ఉంది. ఈమె కూడా కరోనా లాక్ డౌన్ టైములో ఎంతో మందికి అన్నం పెట్టింది. పెద్ద సినీ కళాకారులకు డబ్బులిచ్చి వారి ఆర్ధిక అవస్రతలను కూడా తీర్చింది. ఈమె అసలు సిసలైన హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ప్రణీత పై ప్రశంసలు కురిపించారు. రాంచరణ్ వంటి స్టార్ హీరో కూడా ప్రణీతను అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ వేసాడు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..
తాజాగా ప్రణీత సుభాష్ తన సోషల్ మీడియాలో ఓ ఫొటోని షేర్ చేసింది.ఈ ఫోటోని పరిశీలిస్తే… ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో జరిపిన ఓ ప్రక్రియలో భాగంగా ప్రణీత తన మొహానికి సూదులు గుచ్చినట్టు స్పష్టమవుతుంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ‘వామ్మో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆక్యుపంక్చర్ వైద్యం అనేది చైనాలోని పురాతన వైద్య విధానం. ఆ విషయం ఎలా ఉన్నా.. ప్రణీత సూదుల ఫోటో మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది.