యంగ్ హీరోయిన్ ప్రణీత ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుని ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయడంతో పాటు షాకయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రణీత అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడానికి అసలు కారణమేంటో అభిమానులకు అర్థం కాలేదు. తాజాగా ప్రణీత పెళ్లిపై నోరు విప్పటంతో పాటు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇలా పెళ్లి చేసుకున్నందుకు దయచేసి క్షమించాలని ఆమె అభిమానులను కోరారు.
తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా మే 30వ తేదీన తన పెళ్లి జరిగిందని ప్రణీత అన్నారు. తన పెళ్లికి సంబంధించిన ప్రకటన చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రణీత చెప్పుకొచ్చారు. పెళ్లికి సంబంధించి ముందుగా సమాచారం ఇవ్వలేకపోయామని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే అందుకు కారణమని ప్రణీత అన్నారు. పెళ్లి తేదీని నిర్ణయంచుకోకపోవడం వల్లే అభిమానులకు డేట్ గురించి చెప్పలేదని ప్రణీత పేర్కొన్నారు.
అభిమానులు తన క్షమాపణలను స్వీకరించాలని ప్రణీత కోరారు. తన జీవితంలో పెళ్లిరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు అని పెళ్లిరోజున అభిమానులు భాగస్వామ్యం కావడం కంటే మరో ఆనందం లేదని ఆమె చెప్పుకొచ్చారు. అభిమానులు తనకు ఎప్పుడూ స్పెషల్ అని సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత సెలబ్రేషన్స్ జరుపుకుందామని ప్రేమతో ప్రణీత అండ్ నితిన్ అంటూ ప్రణీత తన పోస్ట్ ను ముగించారు. అభిమానులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న ప్రణీత ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన అభిమానులు కూల్ అయ్యేలా చేయడం గమనార్హం.
1
2
3
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!