కన్నడ సినిమా పరిశ్రమలో 30కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అంటేనే ఒక అద్భుతం. అలాంటిది సెంచరీ కొట్టేసేలా చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. KGF సినిమాతో అతను కన్నడ స్థాయిని కూడా అమాంతంగా పెంచేశాడు. ఇక KGF 2 మరో లెవెల్ కు తీసుకు వెళ్లడం కాయం. ప్రస్తుతం అందరి చూపు కూడా అదే సినిమాపై ఉంది. ఒక్క టీజర్ తోనే ప్రశాంత్ అన్ని ఇండస్ట్రీలకు బాక్సాఫీస్ హెచ్చరిక పంపాడు. ఇక రానున్న రోజుల్లో ఈ దర్శకుడు వరుసగా 5 సినిమాలను మనం తెలుగు హీరోలతోనే చేయనున్నాడు.
మన హీరోలకు కన్నడ ఇండస్ట్రీలో కూడా పవర్ఫుల్ మార్కెట్ ఉంది. ఇక ప్రశాంత్ నీల్ లైనప్ ఈ విధంగా ఉంది. ప్రస్తుతం సలార్ సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాను కూడా హై వోల్టేజ్ డ్రామాతో తెరపైకి తీసుకురానున్నాడు. ఇక అల్లు అర్జున్ – గీతా ఆర్ట్స్ లో కూడా ఒక సినిమా రానున్నట్లు టాక్ అయితే వస్తోంది. ప్రభాస్ – దిల్ రాజు కాంబినేషన్లో కూడా ప్రశాంత్ నీల్ మరో యాక్షన్ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు.
మరోవైపు డివివి.దానయ్యతో కూడా ఒక కమిట్మెంట్ ఉన్నట్లు క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రశాంత్ నీల్ ఇలా వరుసగా టాలీవుడ్ హీరోలను లైన్ లో పెట్టేశాడు. ఇక సలార్, ఎన్టీఆర్ సినిమాలకు 10కోట్ల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్న ఈ దర్శకుడు ఆ తరువాత సినిమాల రిజల్ట్ ను బట్టి రేటు పెంచే అవకాశం ఉంది.