Prashanth Neel: తారక్ మూవీ విషయంలో ప్రశాంత్ నీల్ అలా చేయబోతున్నారా?

  • November 15, 2022 / 06:27 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడగా ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఒకే సమయంలో రెండు భాషల్లో తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తెలుగుతో పాటు కన్నడ భాషలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారని బోగట్టా.

అయితే రెండు భాషల్లో సినిమాను తెరకెక్కించడం వల్ల వర్కింగ్ డేస్ పెరిగే అవకాశాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ విధంగా చేయడం వల్ల బడ్జెట్ భారం కూడా కొంతమేర పెరుగుతుంది. తారక్ వేగంగా సినిమాల్లో నటించాలని అభిమానుల నుంచి ఒకింత ఒత్తిడి ఉందనే సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ తారక్ వీరాభిమాని కాగా తారక్ ఒకే భాషలో తెరకెక్కించాలని సూచిస్తే దర్శకుడు అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

కొరటాల శివ సినిమాను పూర్తి చేసిన వెంటనే తారక్ ప్రశాంత్ నీల్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఈ రెండు సినిమాలలో తారక్ భిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. అందువల్ల ఒక సినిమా పూర్తైన తర్వాతే తారక్ మరో సినిమాపై దృష్టి పెట్టనున్నారు. తారక్ ప్రశాంత్ కాంబో మూవీ 2024లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే ప్రేక్షకుల్లో అంచనాలను అంతకంతకూ పెంచుతోంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus