ఓ అరడజన్ ప్లాపుల తర్వాత ‘చిత్రలహరి’ తో బయటపడ్డ సాయి తేజ్ నటించిన తాజా చిత్రం ‘ప్రతీరోజూ పండగే’. ‘జిఏ2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేసాడు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్య రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది.
ఇక 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 11.70 cr |
సీడెడ్ | 3.73 cr |
ఉత్తరాంధ్ర | 4.45 cr |
ఈస్ట్ | 1.96 cr |
వెస్ట్ | 1.47 cr |
కృష్ణా | 1.99 cr |
గుంటూరు | 1.90 cr |
నెల్లూరు | 0.86 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.80 cr |
ఓవర్సీస్ | 2.58 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 32.44 cr (share) |
‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 17 రోజులు పూర్తయ్యేసరికి 32.44 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 17 వ కూడా ఈ చిత్రం 0.94 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే సాయి తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఫుల్ రన్ పూర్తయ్యేసరికి 35 కోట్ల షేర్ మార్క్ ను దాటే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
Click Here to Read Prati Roju Pandage Movie Review
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!