మెగా మేనల్లుడు సాయి తేజ్.. కు 2019 బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే… అరడజను ప్లాఫుల తర్వాత ‘చిత్రలహరి’ చిత్రంతో బయటపడ్డాడు. ఆ చిత్రంతో డీసెంట్ హిట్ మాత్రమే కొట్టిన తేజు.. తరువాత ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టరే కొట్టాడు. ‘జిఏ2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేసాడు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్య రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఇక ఈ చిత్రం 19 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 12 cr |
సీడెడ్ | 3.83 cr |
ఉత్తరాంధ్ర | 4.63 cr |
ఈస్ట్ | 2 cr |
వెస్ట్ | 1.49 cr |
కృష్ణా | 2.03 cr |
గుంటూరు | 1.94 cr |
నెల్లూరు | 0.88 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.81 cr |
ఓవర్సీస్ | 2.58 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 33.19 cr (share) |
‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 19 రోజులు పూర్తయ్యేసరికి 33.19 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక 19 వ రోజు.. అదికూడా మంగళవారం అయినప్పటికీ.. ఈ చిత్రం 0.34 కోట్ల షేర్ ను రాబట్టింది. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Click Here to Read Prati Roju Pandage Movie Review
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!