టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్యల్లో వీడిన మిస్టరీ

టీవీ నటి ప్రత్యూష బెనర్జీ అంటే మహిళలకి చాలా ఇష్టం. ఆమె హిందీ సీరియల్ ‘బాలికా వధు’లో ఆనంది పాత్ర ద్వారా చేసే మంచి పనులతో దేశవ్యాప్తంగా అభిమానులను ఏర్పరుచుకుంది.ఇదే సీరియల్ ‘చిన్నారి పెళ్లి కూతురు’ పేరుతో తెలుగులో డబ్ అయి ప్రసారం కావడంతో తెలుగు ఆడపడుచులు కూడా ఆమెలా దైర్యంగా ఉండాలని అనుకున్నారు. అంత స్ఫూర్తినిచ్చిన ప్రత్యూష ముంబైలోని తన నివాసంలో ఏప్రిల్ 1న  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు అసలుకారణం తాజాగా బయటపడింది.చెడ్డపని చేయలేక ప్రాణత్యాగానికి ఒడిగట్టిందని తెలిసింది.

ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ ఆమెనువ్యభిచారంలోకి దింపే ప్రయత్నం చేశాడని ఆమె తరుపు లాయర్ కోర్టులో బలంగా చెప్పారు. అందుకు సాక్ష్యంగా ప్రత్యూష చివరి సారి మాట్లాడిన ఫోన్ కాల్ ని సమర్పించారు. అందులో ఇలా ఉంది.. “నన్ను నేను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదు. నేను నటించడానికి వచ్చాను. నేను పని చేసుకోవడానికి వచ్చాను. నువ్వు నన్నుఎక్కడ పెడుతున్నావు.. నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు..’’అంటూ ప్రత్యూష ఏడ్చినట్లుగా ఉంది. “ఫోన్లో ఆ సంభాషణలు అన్నీ ప్రత్యూష మరణానికి కొంచెం ముందుగా జరిగినవి. వాటి ప్రకారం ప్రత్యూష చేత వ్యభిచారం చేయించాలని రాహుల్ ప్రయత్నించాడని స్పష్టం అవుతోంది.’ అని ప్రత్యూష తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

https://www.youtube.com/watch?v=7r6cAde2s-s

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus