ఆ టివీ నటి రెండు నెలల గర్భవతి

  • April 4, 2016 / 10:39 AM IST

చిన్నారి పెళ్లికూతురుగా పేరుగాంచిన ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ రెండు నెలల గర్భవతి అని వెల్లడైంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న నేపద్యంలో వైద్యులు శవపరీక్ష చేసినప్పుడు ఈ విషయం తెలిసిందని సమాచారం వస్తోంది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె బాయ్ ప్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ ఆదివారం నాడు పోలీసుల ఎదుట హాజరుకావల్సి ఉన్నా వెళ్లలేదు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలోచేరాడు. అతనికి చాతీ నొప్పి అని చెబుతున్నారు. కాగా అతని స్నేహితురాలు ఒకరు మాట్లాడుతూ ఎవరు అంగీకరించినా,అంగీకరించకపోయినా, ప్రత్యూష చనిపోయినప్పటి నుంచి అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడని,రోదిస్తూనే ఉన్నాడని అన్నారు.అతనికి ఏమవుతుందో తెలియడం లేదని, మానసికంగా కుంగిపోయాడని ఆమె అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus