అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ది ఘోస్ట్’. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ గా నాగార్జున కనిపించబోతున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అవి మీ కోసం :
‘ది ఘోస్ట్’ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి?
‘ఘోస్ట్’ అంటే భయంకరమైన పదం ఉంది కానీ మా సినిమాకి వచ్చేసరికి ఇది ఒక కోడ్. రా, ఇంటెలిజెన్స్ ఫీల్డ్ లో ఈ పదానికి ఒక పవర్ వుంది. ఘోస్ట్ ప్రోటోకాల్ అని అంటారు. ఇందులో కథానాయకుడు కోడ్ ఘోస్ట్. అండర్ వరల్డ్ అతనికి పెట్టిన పేరు అది.
నాగార్జున గారికి ఈ కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి?
నిర్మాతలు సునీల్, శరత్ మరార్ లని ముందుగా కలిసినప్పుడు నాగ్ సర్ తో చెయ్యాలి అన్నారు. నాగార్జున గారంటే నా మనసులో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వుంది. ఆ రకంగా చూపించాలని ఈ కథ రాసాను. నా కెరీర్ లో హీరోకి కథ రాయడం ఇదే తొలిసారి. ఆయన ఇంటెన్సిటీ, స్టైల్, గ్రేస్ ఉపయోగించుకొని , ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో ఆ విధంగా ‘ది ఘోస్ట్’ ని డిజైన్ చేసుకున్నాను.
ఈ చిత్రంలో నాగార్జున గారి పాత్ర ఎలా ఉండబోతుంది?
తక్కువగా మాట్లాడి బలమైన యాక్షన్స్ తో ఇంపాక్ట్ చూపే విధంగా ఉంటుంది. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇది. ప్రతి యాక్షన్ సీన్ వెనుక బలమైన ఎమోషన్ ఉంటుంది.
తొలిసారి హీరోని అనుకున్నాక కథ రాశాను అన్నారు కదా ? అప్పుడు మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి ?
నిజానికి హీరోకి కథ రాయడం ఈజీ. మనకి ఒక స్పష్టమైన క్లారిటీ, డైరెక్షన్ వచ్చేస్తుంది. మన బౌండరీలు మనకు తెలిసిపోయినప్పుడు ఆ పరిధిలోనే ఆలోచిస్తాం. కానీ కథ రాసుకుని తర్వాత అందులో నటులని ఫిట్ చేయడమే కష్టం.
ది ఘోస్ట్ లో తమహగనే లాంటి ఆయుధాలు కూడా డిజైన్ చేశారు కదా ?
కథ రాసుకున్నపుడు ప్రతి పాత్రకు ఒక బ్యాక్ స్టోరీ రాస్తాం. అలాంటి బ్యాక్ స్టోరీ ఉన్నపుడే పాత్రకు బలం చేకూరుతుంది. నాగార్జున గారు ఇందులో 40 ఏళ్ల ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తారు. అయితే ఈ జర్నీలో ఆయన చాలా మిషన్స్ లో పాల్గొని ఉంటారు. అలా తన జర్నీ లో జపాన్ వెళ్ళినపుడు అక్కడ ఒక వ్యక్తి ఇచ్చే మెటల్ తమహగనే. ది ఘోస్ట్ కంప్లీట్ ఫిక్షన్ స్టొరీ.
ఈ సినిమాలో ఎన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి?
8 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి.. చిన్న చిన్న వాటితో కలుపుకుని 12 యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి.
హీరోయిన్ సోనాల్ చౌహాన్ గురించి ?
సోనాల్ చౌహాన్ చాలా అంకిత భావంతో పని చేసే నటి. మాకు చాలా సమయం ఇచ్చి చాలా హార్డ్ వర్క్ చేసి బ్రిలియంట్ గా పెర్ఫార్మ్ చేసింది.
మీ తొలి మూడు చిత్రాలు సొంత ప్రొడక్షన్ లో చేశారు కదా.. ఇప్పుడు వేరే ప్రొడక్షన్.. ఈ విషయంలో ఎలాంటి తేడాలు.. సవాళ్ళు ఉంటాయి?
క్రియేటివ్ గా ఆలోచిస్తే సొంత ప్రొడక్షన్ నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు. సొంత ప్రొడక్షన్ చేయడం వలన నిర్మాత కష్టాలు కూడా తెలుసు. ఎంతవరకు రాజీపడాలో తెలుసు. అయితే సొంత ప్రొడక్షన్ లో రిలీజ్ సమయంలో సమస్య వస్తుంది. సినిమాని రిలీజ్ చేయడం అంటే తేలికైన పని కాదు. మంచి ప్రోడక్ట్ ని రెడీ చేసిన తర్వాత దాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం. నా ప్రొడక్షన్ లో వచ్చిన చిత్రాలకు రిలీజ్ దగ్గర ఇబ్బందిపడ్డా. అయితే వేరే నిర్మాణ సంస్థలో చేస్తున్నపుడు కూడా నిర్మాత సెట్ లో ఉంటే బాగుంటుంది. నా వరకు నిర్మాతని ప్రతి రోజు సెట్ కి రమ్మని చెబుతాను. నిర్మాత సెట్ లో ఉంటే పనులు త్వరగా జరుగుతాయి.
ది ఘోస్ట్ విషయంలో మీరు ఎదురుకున్న పెద్ద సవాల్ ఏంటి ?
కోవిడ్ (నవ్వుతూ). సెకండ్ వేవ్ , థర్డ్ వేవ్ వలన షూటింగ్ షెడ్యూల్ కొంచెం డిస్టర్బ్ అయ్యాయి. దుబాయ్ లో షూట్ అనుకున్నాం . రెండు రోజుల ముందు క్యాన్సిల్ అయ్యింది. తర్వాత అక్కడికి వెళితే ముందు రెక్కీకి వెళ్ళిన యాక్షన్ కొరియోగ్రాఫర్ అందుబాటులోకి రాలేదు.దీంతో కొత్తతని తో చేయాల్సి వచ్చింది. కోవిడ్ నిబంధనలు కారణంగా షూటింగ్ అనుమతులు కూడా కష్టమయ్యాయి.
ఎక్కువ నార్త్ నటీనటులు వున్నారు కదా ?
పాత్రలకు తగ్గట్టుగానే ఎంపిక చేశాం, నార్త్ అయినప్పటికీ డబ్బింగ్ వారే చెప్పారు.
మీకు ఇప్పటివరకు థియేట్రికల్ సక్సెస్ అనేది దక్కలేదు. ‘ది ఘోస్ట్’ తో అది సాధ్యమవుతుందా?
హై ఎమోషన్స్ హీరోయిజం ఉన్న చిత్రమిది. చాలా గూజ్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. విజిల్ వేసే మూమెంట్స్ కూడా వుంటాయి. క్లాస్ గా తీసిన పక్కా మాస్ ఫిల్మ్ ఇది. థియేటర్లో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది.
ఈ సినిమాకి మొదట కాజల్ ని అనుకుని మార్చాల్సి వచ్చింది కదా.! తర్వాత సోనాల్ నే అనుకున్నారా? లేక వేరే హీరోయిన్ ను అనుకుని ఈమెను ఫైనల్ చేసుకున్నారా?
టాలీవుడ్లో యాక్షన్ ఎపిసోడ్స్ కు ఇంట్రెస్ట్ చూపించే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. కాజల్ తప్పుకున్నాక అమలా పాల్, వంటి హీరోయిన్లను అనుకున్నాం కానీ యాక్షన్ తెలిసిన అమ్మాయి కాబట్టి సోనాల్ చౌహాన్ ని ఫిక్స్ అయ్యాం.
మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి?
వరుణ్ తేజ్ గారితో చేయబోయే సినిమా అక్టోబర్ 10 నుండి యూకే లో మొదలౌతుంది.తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాను.
Most Recommended Video
నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!