నిర్మాతలు దర్శకుడ్ని అడిగే స్టూపిడ్ క్వశ్చన్ అది !! : ప్రవీణ్ సత్తారు

  • July 8, 2020 / 12:03 PM IST

“ఒక సినిమాకి బడ్జెట్ ఎంతవుతుంది అనే ప్రశ్న దర్శకులను ఎందుకడుగుతారు?, “గరుడ వేగ” బడ్జెట్ పెరగడంలో నా పాత్ర లేదు, అసలు మన రాష్ట్రంలో సెన్సార్ రూల్స్ బాలేవు” అంటూ నిప్పులు చెరుగుతున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన “గరుడ వేగ” నవంబర్ 3న రిలీజవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు ప్రవీణ్ సత్తారు.

“డై హార్డ్” తరహా సినిమా..
తెలుగులో “డైహార్డ్, లీతల్ వెపన్” తరహా సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాను. నిజానికి ఇది నేను డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యాక రాసుకొన్న స్క్రిప్ట్ అది. రాజశేఖర్ గారి కోసమే అప్పట్లో ఒక ఎస్.ఐ కోణంలో ఈ కథ రాసుకొన్నాను. కానీ.. ఇన్నాళ్లకి వర్కవుట్ అవడంతో.. ఆ ఎస్.ఐ క్యారెక్టర్ ను కాస్తా ఎన్.ఐ.ఎ ఆఫీసర్ కి మార్చాను. రాజశేఖర్ క్యారెక్టరైజేషన్ హాలీవుడ్ నటులు లియామ్ నేసన్, బ్రూస్ విల్స్ ను పోలి ఉంటుంది.

ప్రొఫెషనల్ లైఫ్ కారణంగా పర్సనల్ లైఫ్ దిస్టర్బ్ అయితే..
ఎస్.ఐ.ఎ ఆఫీసర్ల వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు కేస్ డీల్ చేసే విధానం రెగ్యులర్ పోలీసుల మాదిరికాకుండా సీక్రెట్ గా మాత్రమే కాక కనీసం కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోలేని విధంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో ప్రోబ్లమ్స్ వస్తాయి. అయినప్పటికీ వాళ్ళు పర్సనల్ లైఫ్ కంటే ప్రొఫెషనల్ లైఫ్ కే ఎక్కువ వెల్యూ ఇస్తూ ముందుకుసాగుతుంటారు. ఆ కోణంలో సాగే ఓ ఇంటెన్స్ థ్రిల్లర్ “గరుడ వేగ”.

చాలా సినిమాల ఇన్స్పిరేషన్ ఉంటుంది..
“గరుడ వేగ” ఒక ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్. సో, కొన్ని హాలీవుడ్ అండ్ బాలీవుడ్ సినిమాల నుంచి స్పూర్తి తీసుకోవడం జరిగింది. హిందీ సినిమా “బేబీ”, ఆంగ్ల చిత్రం “డైహార్డ్”ల నుండి కొన్ని సన్నివేశాలు, క్యారెక్టర్స్ స్ఫూర్తిగా తీసుకొన్నామ్. అంతమాత్రాన మాది కాపీ సినిమా అనకూడదు. ఆ తరహా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందిద్దామనే ఉద్దేశ్యంతోనే ఇదంతా చేశాం.

యాక్షన్ సీక్వెన్స్ లు నేనే డిజైన్ చేశాను..
హాలీవుడ్ సినిమాలకి మన తెలుగు సినిమాలకి మధ్య ఉన్న విపరీతమైన వ్యత్యాసం యాక్షన్ సీక్వెన్స్ లను మనోళ్ళు అసల ఏమాత్రం కామన్ సెన్స్ అనేది వాడకుండా తీస్తారు. అందువల్ల ప్రేక్షకులు సదరు యాక్షన్ సీక్వెన్స్ లలో ఇన్వాల్వ్ అవ్వలేరు. అయితే.. “గరుడ వేగ”లో యాక్షన్ సీక్వెన్స్ లను నేనే డిజైన్ చేశాను. సందర్భానుసారంగా కథలో భాగంగానే యాక్షన్ సీన్స్ ఉంటాయే కానీ ఇరికించినట్లుగా ఉండవు.

ఎవరు నటించారు, ఎవరు తీశారు అని జనాలు పట్టించుకోవడం లేదు..
సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైనప్పట్నుంచి నన్ను మీడియా అందరూ అడుగుతున్న ఏకైక ప్రశ్న “రాజశేఖర్ మీద ఏ నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టారు?” అని. కథ బాగోలేక సినిమా 50 కోట్లు పెట్టి తీసినా సినిమా ఆడదు. అదే కథ-కథనాలు బాగుండి రెండు లేదా మూడు కోట్ల రూపాయలతో సినిమా తీసినా సూపర్ హిట్ అవ్వడమే కాదు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. అందుకు తాజా ఉదాహరణ “అర్జున్ రెడ్డి”. నా మునుపటి చిత్రం “గుంటూరు టాకీస్” కూడా నాలుగు కోట్ల రూపాయలతో రూపొంది 21 కోట్లు కలెక్ట్ చేసింది.

ఆ సినిమా సీక్రెట్ గా చూసారే తప్ప..
నా “గుంటూరు టాకీస్” సినిమా ట్రైలర్ రిలీజ్ అప్పట్నుంచి చెబుతూనే ఉన్నాను ఈ సినిమా రెస్ట్రిక్టడ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కోసం మాత్రమేనని. ఫ్యామిలీస్ ఈ సినిమా ఎంజాయ్ చేయలేరు. నా సినిమాని తిట్టినవాళ్ళందరూ ఆ కామెడీని ఎంజాయ్ చేయలేనివారే. చాలామంది “గుంటూరు టాకీస్” సినిమాని రెండుమూడుసార్లు కూడా చూశారు, కానీ చూశాం అని బయటకి చెప్పుకొనే ధైర్యం వారికి లేకపోయింది.

అసలు డైరెక్టర్స్ ని ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు..
డైరెక్టర్ ఒక కథ సిద్ధం చేసుకొని వెళితే.. ముందు కథ ఏ జోనర్, హీరోగా ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుంది అనే ప్రశ్నలు మానేసి “ఎంత బడ్జెట్ అవుతుంది?” అని అడుగుతారెందుకో అర్ధం కాదు. నన్నడిగితే ఒక దర్శకుడ్ని నిర్మాతలు అనవసరంగా అడిగే స్టూపిడ్ క్వశ్చన్ అది.

బడ్జెట్ పెరగడానికి బాధ్యుడ్ని నేను కాదు..
“గరుడ వేగ” చిత్రాన్ని 8 కోట్ల రూపాయలతో తీద్దామని మొదలుపెట్టిన మాట వాస్తవమే. అయితే.. సినిమా బడ్జెట్ పెరగడంలో నా తప్పేం లేదు. సరైన “లైన్ ప్రొడ్యూసర్” లేకపోవడం వల్ల “గరుడ వేగ” బడ్జెట్ పరిమితులు దాటిపోయింది తప్పితే అసలు నా తప్పేమీ లేదు.

రాజశేఖర్ గారు బౌండెడ్ స్క్రిప్ట్ తో యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా..
“గరుడ వేగ” షూటింగ్ స్టార్ట్ అయ్యాక నాకు తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ రాజశేఖర్ గారు నటించిన ఏ సినిమాకీ కూడా సరైన స్క్రిప్ట్ లేదట. జస్ట్ స్టోరీ ఇదని ఫిక్స్ అయిపోయి సెట్స్ కు వెళ్లిపోయేవారట. ఆయన కెరీర్ లో పూర్తి స్థాయి స్క్రిప్ట్ వర్క్ జరగడంతోపాటు బౌండెడ్ స్క్రిప్ట్ తో సెట్స్ కు వెళ్ళిన ఏకైక అండ్ మొదటి సినిమా “గరుడ వేగ”.

సెన్సార్ వాళ్ళు మరీ సెన్స్ లేకుండా కట్స్ చెబుతున్నారు..
మా సినిమా సెన్సార్ కి వెళ్లినప్పుడు మొదట 14 కట్స్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన అన్నీ కట్స్ లో ఒక్కటి మాత్రమే నాకు సమంజసం అనిపించింది. మిగతా కట్స్ విషయంలో ఎక్కడా సెన్స్ లేదు. వారితో వాదించి మొత్తానికి 14 కట్స్ ని 5 కి తీసుకువచ్చాను. అవి కూడా అవసరమా అనిపిస్తుంది సినిమా చూసినవారికి. సెన్సార్ బోర్డ్ లో జీవితగారు ఉన్నప్పటికీ.. ఆవిడ సహాయం తీసుకోలేదు, సినిమా ఆవిడ చూడలేదు కూడా.

తదుపరి సినిమా సుధీర్ బాబుతో..
ఇప్పటివరకూ నేను అన్నీ డిఫరెంట్ జోనర్సే ట్రై చేశాను. అలాగే “గరుడ వేగ” అనంతరం సుధీర్ బాబు గీరోగా పుల్లెల గోపీచంద్ బయోగ్రఫీ ప్లాన్ చేస్తున్నాను. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. గోపీచంద్ జీవితంలో చోటు చేసుకొన్న పరిణామాలను చాలా టోన్ డౌన్ చేసి ఒక మంచి డ్రామాగా తెరకెక్కిస్తాను.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus