Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- August 11, 2026 / 09:55 AM ISTByPhani Kumar
ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలకు పల్లె అందాలను జోడిస్తూ తెరకెక్కుతున్న ఆసక్తికర చిత్రం ‘ప్రేమనే ఊరిలో’(Premane Oorilo). అందమైన గ్రామీణ నేపథ్యం, హృదయానికి హత్తుకునే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
Premane Oorilo

శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, మానవ సంబంధాలు, పల్లె జీవనశైలిని ప్రతిబింబించే కథగా ఈ చిత్రం రూపొందుతోంది. “Welcome to the Land of Love” అనే క్యాప్షన్‌తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పచ్చని పొలాలు, గాలిమరలు, ఎడ్లబండి, అందమైన పల్లె వాతావరణంతో రూపొందిన పోస్టర్ సినిమా కథలోని ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలకు చక్కటి ప్రతిబింబంగా నిలిచింది.
టైటిల్‌కు తగ్గట్టుగా ప్రేమను పల్లె అందాలతో ముడిపెట్టి చూపించిన ఫస్ట్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.సినిమాకు ప్రతిభావంతమైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. KGF, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాశారు. ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కథ, ప్రేమ, భావోద్వేగాలు, బలమైన పాత్రలు, అందమైన పల్లె నేపథ్యంతో పాటు సురేష్ కొండేటి కంటెంట్ సెలక్షన్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు తో ‘ప్రేమనే ఊరిలో’ మరో మంచి చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.














