Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

  • September 20, 2026 / 05:43 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’(Premane Oorilo). ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Premane Oorilo

kamakshi bhaskarla

ఇక శనివారం నాడు మరో పాటను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌లో కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. “ప్రేమనే ఊరిలో’ అనే టైటిలే చాలా బాగుంది. టీజర్‌లో శ్రీకాంత్ గారి వాయిస్ ఓవర్ బాగుంది. తణికెళ్ల భరణి గారు రిలీజ్ చేసిన పాట కూడా బాగుంది. ఈ ప్రమోషన్స్‌లో నన్ను భాగస్వామిని చేసిన సురేష్ గారికి థాంక్స్. ఈ సినిమాతో శ్రీనివాస్ గారికి మంచి విజయం దక్కాలి. ఆర్టిస్టులు తెరపై అద్భుతంగా కనిపించారు. ‘ప్రేమనే ఊరిలో’ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలని, నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

చందు శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ సినిమాతో నిర్మాతగా అడుగు పెడుతున్నాను. చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాను. దేవేందర్ గారు నాకు బిజినెస్‌లో హెల్ప్ చేశారు. ఆయన వల్లే ఈ సినిమా నాకు తెలిసింది. పోస్టర్ చూసిన వెంటనే నాకు ఎంతో నచ్చింది. టీజర్ చూసిన వెంటనే సురేష్ గారికి ఫోన్ చేశాను. శ్రుతి, దేవేందర్, నేను కలిసి ఈ టీజర్‌ను సురేష్‌కి చూపించాం. అదే రోజు సినిమాని మేమంతా చూశాం. జెన్ జీ ఆడియెన్స్‌ని కూడా మూవీని చూపించాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌కి సినిమా చాలా నచ్చింది. రాంబాబు మాకు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. శ్రీరామ్, రమిక, తపస్విని అద్భుతంగా నటించారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘నేను గతంలో చేసిన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’ రేంజ్‌లో ‘ప్రేమనే ఊరిలో’ ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి దూరంగా ఉండమని చందుకి సలహా ఇస్తుంటాను. అయితే ఈ మూవీ గురించి చెప్పినప్పుడు, చూసినప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. మనం కలిసి ఇకపై జర్నీ స్టార్ట్ చేద్దాం అని చందుతో అన్నాను. ‘ప్రేమనే ఊరిలో’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. శ్రీరామ్, రమిక, తపస్వినిలకు ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది. కన్నడ, తెలుగులో ఈ సినిమాకి మంచి విజయం దక్కుతుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రూపాయి పెడితే ఐదు రూపాయల లాభం తీసుకు వచ్చే సినిమా అవుతుంది. నా ప్రాజెక్ట్‌లోకి సాకేత్ వచ్చాడంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నా ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు థాంక్స్. మా ‘ప్రేమనే ఊరిలో’ సినిమాకి మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ చిత్రం కోసం హైదరాబాద్‌కి రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు అంతులేని ప్రేమను చూపిస్తారు. నాకు కన్నడ ఇండస్ట్రీతో పాటుగా తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ‘ప్రేమనే ఊరిలో’ సోల్ ఫుల్, ఎమోషనల్, మ్యూజికల్ లవ్ స్టోరీ. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. తెలుగులో సినిమాలు చేయాలని ఉంది. నాక్కూడా ఇక్కడి ప్రేక్షకులు కొంత ప్రేమను ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటి తపస్విని మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ చిత్రంతో తెలుగులో పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. ప్రతీ ఒక్కరికీ మా సినిమా కనెక్ట్ అవుతుంది. సెప్టెంబర్ 25న మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటి రమిక మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ చిత్రంలో అవకాశం ఇచ్చిన మనోజ్ గారికి థాంక్స్. మనోజ్ గారు ఓ మంచి కథతో సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీలోని ప్రతీ పాత్ర ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతుంది. కన్నడ, తెలుగులో ఇదే నా తొలి చిత్రం. ఇంత మంచి ప్రాజెక్ట్‌తో పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. మా సినిమా సెప్టెంబర్ 25న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు మాట్లాడుతూ .. ‘ఈ మధ్య కాలంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీస్ తక్కువయ్యాయి. ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ .. ‘సురేష్ కొండేటికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది. నటుడు, నిర్మాత, దర్శకుడిగా సురేష్ కొండేటి మల్టీ టాలెంటెడ్. సురేష్ తీసుకు వస్తున్న ‘ప్రేమనే ఊరిలో’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చందుతో నాకు ఎణ్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

సింగర్ సాకేత్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ చిత్రంలో పాటలు పాడటం ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో అద్భుతమైన మ్యూజిక్ ఉంటుంది. శ్రీరామ్, రమిక, తపస్విని అద్భుతంగా నటించారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ సినిమాని మాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా ఉంటాయి. సురేష్ గారు, చందు గారు సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు’ అని అన్నారు.

కో డైరెక్టర్ శ్రుతి మాట్లాడుతూ .. ‘‘దర్శక, నిర్మాతలు సినిమా పనిలో ఉండి ఇక్కడకు రాలేకపోయారు. మనోజ్ గారు కన్నడలో చేసిన సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది. ‘ప్రేమనే ఊరిలో’ పాయింట్ తట్టినప్పటి నుంచి తెలుగు, తమిళంలో చేయాలని అనుకున్నాం. ఆ టైంలోనే చందు గారు, సురేష్ గారు మా ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. శ్రీ గారు, తపస్విని, రమిక గారు అద్భుతంగా నటించారు. మా పాటను లాంచ్ చేసేందుకు వచ్చిన కామాక్షి గారికి థాంక్స్. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమాకి మ్యూజిక్ సోల్‌గా నిలుస్తుంది. రాంబాబు గారు మాకు మంచి లిరిక్స్ ఇచ్చారు. బెంగళూరులో ఓ చిన్న ఆలోచనగా మొదలైన ఈ సినిమా సెప్టెంబర్ 25న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

మహదేవ్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ చిత్రం అద్భుతంగా వచ్చింది. మా సినిమాకి మీడియా సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రానికి పని చేయడం వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను. సెప్టెంబర్ 25న మా మూవీ రాబోతోంది. అందరూ చూసి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Premane Oorilo
  • #Premane Oorilo movies

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

24 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

24 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

52 mins ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version