‘స్టార్ మా’ లో సోమవారం నుండీ శనివారం వరకూ సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. మలయాళం నటి అయినప్పటికీ.. తెలుగు సీరియల్ ద్వారా లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈమె పై ఎన్నో మీమ్స్ వస్తుంటాయి. ‘డాక్టర్ బాబు.. వంటలక్క ఎప్పుడు కలుసుకుంటారా?’
అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తుంటారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలియజేసింది. తెలుగులో తెరకెక్కుతోన్న ఓ లేడి ఓరియెంటెడ్ మూవీలో ప్రేమి విశ్వనాథ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుందట. ‘నేను నటినవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో యాదృశ్చికంగా జరిగిపోయింది. ఈరోజు నాకు ఇంత మంది అభిమానులున్నారంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. నిజానికి కరోనా రాకపోయి ఉంటే… ఈ పాటికి నేను నటించిన ఓ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఉండేది.
కరోనా రావడం వల్ల ఆ చిత్రం షూటింగ్ వాయిదా పడింది’ అంటూ చెప్పుకొచ్చింది ప్రేమి విశ్వనాథ్. మొత్తానికి బుల్లితెర పై ఇన్నిరోజులుగా అందరినీ ఆకట్టుకుంటోన్న వంటలక్కను త్వరలోనే వెండితెర పై కూడా చూడబోతున్నామన్న మాట.