బాహుబలి(సిరీస్) తో ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు రాజమౌళి. ఆ తర్వాత వచ్చిన ఆర్.ఆర్.ఆర్ తో కూడా ఆ ఇమేజ్ ను నిలబెట్టుకున్నారు. దేశం గర్వించదగ్గ రాజమౌళి సినిమాల్లో అవకాశాలు వస్తే మిస్ చేసుకునేవాళ్లు ఉంటారా..? అంటే అవును అనే సమాధానం కూడా చెప్పుకోవాలి. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా రాజమౌళి సినిమాల్లో చేస్తే చాలు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో… అంతే మంది నొ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.
ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో నటించే నటీనటులు ఎక్కువ కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న పాత్రనైనా రాజమౌళి చాలా కేర్ తీసుకుని డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. ఆ పాత్రకి ఎంచుకున్న నటీనటులు దానికి న్యాయం చేసే వరకు వాళ్ళని వదిలిపెట్టరు. అక్కడే వచ్చింది అసలు సమస్య. అందుకే రాజమౌళి సినిమాని మిస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లిస్ట్ లో కార్తీక దీపం నటి ప్రేమి విశ్వనాథ్ కూడా ఉంది.
అవును ఆర్.ఆర్.ఆర్ లో ఆమె మల్లి అనే పాపకి తల్లి పాత్రలో నటించాల్సి ఉంది. అయితే ఆ టైంలో ప్రేమి చాలా బిజీగా ఉంది. రాజమౌళి అడిగిన కాల్ షీట్లు ఆమె అడ్జస్ట్ చేయలేక నొ చెప్పిందట. దాంతో ఆ పాత్రకి అహ్మరీన్ అంజుం అనే నటిని ఎంపిక చేసుకున్నారట. ఈమెకు రెండే సీన్లు ఉంటాయి. సినిమా స్టార్టింగ్ లో కనిపిస్తుంది మళ్ళీ ఎండింగ్ లో కనిపిస్తుంది.