Vantalakka: పొలిటికల్ ఎంట్రీ పై ప్రేమి విశ్వనాథ్ ఫన్నీ కామెంట్స్..!

  • June 3, 2021 / 04:18 PM IST

బుల్లితెర పై సంచలనాలు సృష్టిస్తున్న సీరియల్ ఏది అంటే ‘కార్తీకదీపం’… అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సీరియల్ ద్వారా బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది నటి ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ లో ఆమె దీప అలియాస్ వంటలక్క పాత్రను పోషించింది. సోషల్ మీడియాలో ఈ పాత్ర పై ఎన్ని మీమ్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా ఈమె ఎం.ఎల్.ఏ గా పోటీ చేస్తాను అంటూ చేసిన కామెంట్స్ పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. ప్రేమి విశ్వనాథ్ కేరళకు చెందిన మహిళ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈమెకు తన సొంత రాష్ట్రంలో ఉండే రాజకీయాల పై ఇంట్రెస్ట్ లేదట.కానీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల పై ఆసక్తిగా ఉన్నట్లు ఓ సందర్భంలో చెప్పి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇటీవల ‘కార్తీక దీపం’ సీరియల్ షూటింగ్ టైం లో నిర్మాత గుత్తా వెంకటేశ్వరరావు గారితో ఈమె సరదాగా ముచ్చటించింది. ఈ క్రమంలో కరోనా వల్ల ఏర్పడిన లాక్ డౌన్, ఆగిపోయిన సినిమాలు, పాలిటిక్స్ వంటి విషయాల పై వీరు డిస్కస్ చేసుకున్నారు.

అదే టైములో ప్రేమి సొంత రాష్ట్రమైన కేరళలో.. ‘మా పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచింది’ అంటూ కామెంట్ చేసింది.దీనికి ఆ నిర్మాత నీకేమైనా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అంటూ నిర్మాత చమత్కరించారు. ‘నాకు పాలిటిక్స్ ఇంట్రస్ట్ లేదు’ అంటూ ఈమె జవాబిచ్చింది. అయితే ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పింది వంటలక్క. మరి ఏ పార్టీలో చేరతావ్? ఆ నిర్మాత ప్రశ్నించగా ‘అది చేరే టైంలో చెప్తా’ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus