ప్రియా వారియర్ అంటే తెలియని వారుండరు. ఎందుకంటే ఈ భామ ఒక కన్నుకొట్టి సోషల్ మీడియా ని షేక్ చేసింది. దీంతో ఈ భామకి ఒక్కసారిగా క్రేజ్ చాలా పెరిగిపోయింది. అయితే ‘ఓరు ఆధార్ లవ్’ అనే మలయాళ సినిమాలో ఒక పాటలో కన్నుగీటి కుర్రకారుకి కునుకు లేకుండా చేసి అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకున్న ఆమెకి అన్ని ఇండస్ట్రీస్ నుండి వరుసగా తెగ ఆఫర్లు వచ్చాయంటా. అయితే ఈ మధ్య మెగా ఫ్యామిలీ లో ఒక హీరో సరసన నటించమని అడుగగా అమ్మడు అందరికి షాక్ ఇచ్చిందంటా.
ఇక విషయంలోకి వెళితే, చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా, పులి వాసు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. రాబోయే కొద్దీ రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఈ సినిమాలో చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన నటించమని దర్శక, నిర్మాతలు హీరోయిన్ ప్రియా వారియర్ ని అడుగగా, ఆమె కోటి రూపాయల పారితోషికం అడిగిందట. ఇలా కోటి అనగానే షాక్ కి గురయ్యారంట. అసలు ఈ భామకి స్టార్ హీరోల సరసన మాత్రమే నటించాలని ఉందని, కొత్తగా వస్తున్న హీరోలతో చేయడానికి ఇష్టంలేదని చెప్పలేక ఇలా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని కొందరి వాదన.