పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో తెలుగు వారికి దగ్గరైన ప్రియమణి.. తర్వాత అనేక సినిమాల్లో నటించింది. అయితే ఏది పెద్దగా పేరు తీసుకురాకపోవడంతో బుల్లి తెరకి వెళ్లిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఈమె సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఈవెంట్ మేనేజ్ మెంట్ బిజినెస్ నిర్వహిస్తున్న ముస్తఫారాజ్ ని ప్రేమించింది. వీరిద్దరికి గత ఏడాది మే 27న వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ తర్వాత విడిపోయారని, తెలియకుండా పెళ్లి చేసుకున్నారని అనేక రూమర్లు వచ్చాయి. కానీ వాటన్నింటిని దాటుకుంటూ సంవత్సరం తర్వాత పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల 25న వివాహం జరగనుంది.
ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెలకోంది. పనుల్లో ప్రియమణి బిజీగా ఉంది. మూడు రోజుల పాటు జరగనున్న పెళ్లి వేడుకల్లో మెహందీ, సంగీత్, కాక్ టెయిల్ పార్టీ, రిసెప్షన్ జరగనున్నాయి. ఈ వేడుకలు అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యలు సమక్షంలో జరగనుందని సమాచారం. పెళ్లి తర్వాత ప్రియమణి ఇంటికే పరిమితమవుతుందా? లేకుంటే టీవీలో కొనసాగుతుందా? వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తుందో ? అనేది ఇప్పుడే చెప్పలేము.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.