సాధారణంగా హీరోయిన్స్ కి హీరోలంటే విపరీతమైన అభిమానం, క్రష్ గట్రా ఉండడం సహజమే. మొన్నామధ్య “టాక్సీవాలా” ప్రీరిలీజ్ ఈవెంట్ లో సదరు చిత్ర కథానాయకి ప్రియాంక జవాల్కర్ తనకు చాలా రోజుల నుంచీ అల్లు అర్జున్ అంటే క్రష్ అని పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఆమె ఇండస్ట్రీకి హాట్ టాపిక్ అయిపోయింది. అయితే.. రేపు విడుదలవ్వబోతున్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్న ప్రియాంక జవాల్కర్ “మీకు ప్రెజంట్ జనరేషన్ హీరోయిన్స్ లో ఎవరంటే ఇష్టం? అని అడిగిన ప్రశ్నకు టక్కున పూజా హెగ్డే అని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోయిన్ కాబట్టి అలా చెప్పిందేమో అనుకొనేలోపు.. ఆమెను అభిమానించడానికి గల కారణం కూడా చెప్పి ఆశ్చర్యపరిచింది.
ప్రియాంక జవల్కర్ కు పూజా హెగ్డే బాడీ స్ట్రక్చర్ అంటే చాలా ఇష్టమట. ఎప్పటికైనా ఆమెలాంటి పర్ఫెక్ట్ ఫిగర్ సాధించాలి అని చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే ప్రియాంక చెప్పింది కరెక్టే. అయితే.. ఒక యువ కథానాయకి మరో కథానాయికని ప్రశంసించడం అనేది అభినందనీయం. ఇకపోతే.. టాక్సీవాలా రేపు విడుదలవుతుండగా, ఈ సినిమాపై క్రేజ్ కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తోంది. మరి ఈ చిత్రంతో మన అనంతపూర్ అమ్మాయి స్టార్ హీరోయిన్ గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.