కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియాంక జవాల్కర్..!
- February 6, 2019 / 12:43 PM ISTByFilmy Focus
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘టాక్సీ వాలా’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది ‘ప్రియాంక జవాల్కర్’ . మొదటి చిత్రంతోనే మంచి హిట్ సొంతం చేసుకోవడంతో పాటూ.. తన నటన తో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తన పాత్రకి కూడా మంచి స్కోప్ ఉండడంతో.. మొదటి చిత్రంతోనే మంచి పెర్ఫార్మర్ గా పేరుతెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం కు చెందిన ఈ భామ తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది.
- ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు.. కారణమేమిటంటే..!
- హీరో జై తో ఎఫైర్… పై అంజలి కామెంట్స్!
- హైద్రాబాద్ లో మహేష్ బాబు విగ్రహం
అదే సమయంలో మీడియా తో ముచ్చటించిన ప్రియాంక జవాల్కర్ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలియజేసింది. ఈ క్రమంలో ప్రియాంక మాట్లాడుతూ… “ఇప్పుడే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. దర్శనం చాలా బాగా జరిగింది. తిరుమల ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ‘టాక్సీవాలా’ చిత్రం నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నాలుగు చిత్రాలు డిస్కషన్లో ఉన్నాయని… ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నానని… ఇందులో ఒకటి తమిళ చిత్రం “… అని తెలిపింది. అయితే పెద్ద హీరోల దగ్గర్నుండీ ఆఫర్లు వస్తున్నాయా..? అని విలేకరి అడిగిన ప్రశ్నకి… ‘ఇప్పుడే కదా కెరీర్ మొదలయ్యింది… కొంచెం టైం పడుతుంది…’ అంటూ సమాధానమిచ్చింది.















