మెగాహీరోపై నెగెటివ్ ప్రచారం.. నిజమేనా?

  • November 12, 2022 / 11:58 AM IST

సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి హీరోలను లాక్ చేస్తుంటారు. హీరో ఇచ్చే డేట్స్ ని బట్టి సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఏమైనా జరిగి ప్రాజెక్ట్ సెట్ అవ్వకపోతే.. హీరోలు అడ్వాన్స్ తిరిగిచ్చేస్తారు. ఇది చాలా కామన్ గా జరుగుతుంటుంది. అయితే ఓ మెగాహీరో మాత్రం నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ ను తిరిగివ్వమని అడుగుతుంటే అసలు ఒప్పుకోవడం లేదట. అసలు విషయంలోకి వస్తే.. ఓ చిన్న నిర్మాత పెద్ద బ్యానర్ అసోసియేషన్ తో మెగా ఫ్యామిలీలో చిన్న హీరోని పెట్టి సినిమా చేయాలనుకున్నారు.

తను అనుకున్నట్లుగానే హీరోని కలిసి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చారట. తీరా ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే సమయంలో హీరో ఇన్వాల్వ్ అయి పేరున్న మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కావాలని డిమాండ్ చేశారట. హీరోకి ఉన్న మార్కెట్ కి అతడు డిమాండ్ చేస్తున్న టెక్నీషియన్స్ కి వర్కవుట్ అవ్వదని భావించి.. అసోసియేషన్ కోసం వచ్చిన పెద్ద బ్యానర్ తప్పుకుందట. కానీ అప్పటికే చిన్న నిర్మాత సినిమా మీద రూ.10 లక్షలు ఖర్చు చేశారు.

అలానే హీరోకి రూ.25 లక్షల రెమ్యునరేషన్ అడ్వాన్స్ గా ఇచ్చారు. దీంతో కొంతకాలం పాటు సినిమా చేయడానికి ప్రయత్నించారు. కానీ ఎంతసేపటికీ వర్కవుట్ అవ్వకపోవడంతో సినిమా ఆపేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాపై పెట్టిన డబ్బు ఎలానూ రాదు. కానీసం హీరోకి ఇచ్చిన అడ్వాన్స్ అయినా తిరిగి తీసుకోవాలనుకున్నారు.

కానీ దానికి సదరు మెగాహీరో ఒప్పుకోవడం లేదట. ఈ ప్రాజెక్ట్ కారణంగా లైన్ లో ఉన్న సినిమాలు ఆలస్యమయ్యాయని.. కాబట్టి అడ్వాన్స్ తిరిగిచ్చే ప్రసక్తే లేదని అంటున్నారట. దీంతో చిన్న నిర్మాత చేసేదేంలేక సైలెంట్ గా ఉండిపోయారట.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus