Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘సీతా రామం’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన నిర్మాత అశ్వినీదత్..!

‘సీతా రామం’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన నిర్మాత అశ్వినీదత్..!

  • July 29, 2022 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సీతా రామం’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన నిర్మాత అశ్వినీదత్..!

దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ‘వైజయంతీ మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకం పై అశ్వినీదత్ నిర్మించిన చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ‘సీతా రామం’ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ప్ర.’సీతా రామం’ మీ బ్యానర్ లో మరో ‘మహానటి’ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోవచ్చా?

అశ్వనీదత్ : ఓ మంచి సినిమా తీశాం అనే సంతృప్తి ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటినుండో మంచి ప్రేమకథ చేయాలని అనుకుంటున్నాను. ‘సీతా రామం’ తో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి ‘మరో చరిత్ర’, మణిరత్నం గారి ‘గీతాంజలి’ వంటి చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి. ‘సీతా రామం’ కూడా ఓ ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందనే నమ్మకం వుంది.

ప్ర. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్ కి తగ్గించేశారు. దీనికి కారణాలు ఏమనుకుంటున్నారు.. ?

అశ్వనీదత్ : కరోనా ఒక కారణమని నేను భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తర్వాత తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి.వాటికి డిమాండ్ పెరిగింది. అక్కడ ఇంకా మంచి కంటెంట్ దొరుకుతుంది అనే భావన. ఇలా అనేక కారణాలు ఉన్నాయి.

ప్ర. మీ బ్యానర్లో పనులన్నీ మీ పిల్లలకి అప్పగించినట్లేనా ?

అశ్వనీదత్ : ఎన్టీఆర్ గారు, రాఘవేంద్రరావు, చిరంజీవి గారితో సినిమాలు చేసినప్పుడు వారి రూపంలో నాకు కనిపించని బలం ఉండేది. ఇద్దరు పిల్లలు చదువుపూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపు గా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. ‘మహానటి’ లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. హను ఈ సినిమాని దాదాపు అవుట్ డోర్ లో తీశాడు. నేను షూటింగ్ కి వెళ్ళలేదు. ‘సీతా రామం’ మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది.

ప్ర. ‘సీతా రామం’ లో పాటలు అద్భుతంగా రావాడానికి మీ అభిరుచే కారణం అనుకోవచ్చా?

అశ్వనీదత్ : నిజానికి నాకు సరిగమలు కూడా రావు. కానీ మంచి ట్యూన్ ని పట్టుకొనే అభిరుచి దేవుడు ఇచ్చాడని భావిస్తాను. ”మీరు ఎదురుగా ఉంటే సంగీత సరస్వతి చక్కగా పలుకుతుందండీ”అని మహదేవన్ గారు అన్నారు. సరిగ్గా అదే మాట ఇళయరాజా గారు కూడా అన్నారు. అలాగే మణిశర్మ, కీరవాణితో కూడా సంగీతం పరంగా మంచి అనుబంధం ఉంది. ‘సీతా రామం’ కి విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్ ని తీసుకోవాలనేది హను ఛాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ గారి భార్య కూడా సంప్రాదాయ సంగీత గాయిని. ఆమె సహకారం కూడా ఎక్కువ ఉంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. నేపధ్య సంగీతం కూడా చాలా బాగా చేశారు.

ప్ర. హను రాఘవపూడితో పని చేయడం ఎలా అనిపించింది ?

అశ్వనీదత్ : హను రాఘవపూడి మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు. చాలా గొప్ప కథ చెప్పాడు. అతనికి కెమారా పై అద్భుతమైన పట్టువుంది. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీశారు. కాశ్మీర్ తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్లు ఇందులో విజువల్ ఫీస్ట్ గా అనిపిస్తాయి.

ప్ర. దుల్కర్ సల్మాన్ ని ఈ సినిమాలో హీరోగా తీసుకోవడానికి కారణం ?

అశ్వనీదత్ : ‘మహానటి’ లో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం ఏర్పడింది. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. ‘ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం”అని స్వప్నతో అప్పుడే చెప్పాను. హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్ గా రీచ్ ఉండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు అనిపించింది.

ప్ర. ‘సీతా రామం’ లో నాగ్ అశ్విన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ?

అశ్వనీదత్ : నాగ్ అశ్విన్ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. అయితే కొన్ని సూచనలు ఇస్తుంటారు. తను ‘సీతా రామం’ చూసి అద్భుతంగా ఉందని చెప్పాడు.

ప్ర. సుమంత్ పాత్ర గురించి ?

అశ్వనీదత్ : సుమంత్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రతో ఆయన అన్ని భాషలకు పరిచయం అవుతారు. అతనికి ఈ పాత్ర మంచి పేరుని తీసుకొస్తుంది.

ప్ర. ‘సీతా రామం’ లో ఎన్ని పాటలు వున్నాయి ?

అశ్వనీదత్ : 6 పాటలు ఉంటాయి. ఒకటి అర చిన్న బిట్ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తాయి. అవి కూడా బాగుంటాయి.

ప్ర.’సీతా రామం’ రన్ టైం?

అశ్వనీదత్ : సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు ఉంటుంది. సినిమా ఫాస్ట్ గా వుంటుంది. తమిళ్, మలయాళం వెర్షన్ సెన్సార్ దుబాయ్ లో జరిగింది. అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమా ఏకకాలంలో విడుదలౌతుంది.

ప్ర. మీ తదుపరి ప్రాజెక్టులు ఏంటి?

అశ్వనీదత్ : ప్రభాస్ తో చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ తో ఒక సినిమా డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. ‘అన్నీ మంచి శకునములే’ అనే మూవీ అక్టోబర్ 5న విడుదల కాబోతుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Mrunal Thakur
  • #Producer Aswani Dutt
  • #Rashmika

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version