Aswani Dutt: ఆ కామెంట్ల వల్ల ప్రాజెక్ట్ కే కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్లలో అశ్వినీదత్ ఒకరు కాగా ఈ నిర్మాత నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. ప్రాజెక్ట్ కే సినిమాకు అశ్వినీదత్ నిర్మాత కాగా తాజాగా ఒక సందర్భంలో అశ్వినీదత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆయన చేసిన కామెంట్ల వల్ల ప్రాజెక్ట్ కే సినిమాపై కొంతమేర ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఏపీలో ప్రాజెక్ట్ కే సినిమాకు బెనిఫిట్ షోల విషయంలో, అదనపు టికెట్ రేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలోని నంది అవార్డుల గురించి (Aswani Dutt) అశ్వినీదత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ గా పోసాని కృష్ణమురళి ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కే సినిమాకు ఇబ్బందులు ఎదురైతే ప్రభాస్ ఫ్యాన్స్ కచ్చితంగా ఫీలయ్యే ఛాన్స్ అయితే ఉంది. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదుచూరుస్తున్నారు.

ప్రభాస్ కేవలం ఏడు నెలల గ్యాప్ లో మూడు సినిమాలను థియేటర్లలో విడుదల చేయనున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 90 శాతం పూర్తైందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమా మరింత స్పెషల్ గా ఉండనుందని క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రాజెక్ట్ కే సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus