Salaar: సలార్ ట్రైలర్ ను అలా కట్ చేయడం వెనుక అసలు కారణాలివే!

  • December 12, 2023 / 07:45 PM IST

సలార్ మూవీ రిలీజ్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్నా ఈ సినిమాకు సరైన విధంగా ప్రమోషన్స్ జరగడం లేదు. మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటం వల్లే ప్రమోషన్స్ కు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారని తెలుస్తోంది. అయితే సలార్ విషయంలో నెలకొన్న ఎన్నో సందేహాలకు ఈ సినిమా నిర్మాత విజయ్ కిరంగదూర్ చెక్ పెట్టారు. సలార్ మూవీ ఉగ్రం రీమేక్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు.

ఈ నెల 15వ తేదీ నుంచి సలార్ మూవీ బుకింగ్స్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని విజయ్ కిరంగదూర్ చెప్పుకొచ్చారు. జాతకాలపై ఉన్న నమ్మకం వల్లే ఈ సినిమాకు డిసెంబర్ 22వ తేదీని ఎంపిక చేయడం చేయడం జరిగిందని ఆయన అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్లే సలార్ రిలీజ్ డేట్ ను గతంలో మార్చామని విజయ్ వెల్లడించారు.

సలార్ సినిమా నుంచి అతి త్వరలో ఒక పాటను రిలీజ్ చేయనున్నామని విజయ్ చెప్పుకొచ్చారు. సలార్ ట్రైలర్ ద్వారా పాత్రలను పరిచయం చేయాలని భావించామని ఆ రీజన్ వల్లే సలార్ ట్రైలర్ ను ఈ విధంగా కట్ చేశామని ఆయన తెలిపారు. కేజీఎఫ్ ట్రైలర్స్ కూడా ఇదే విధంగా ఉంటాయని విజయ్ చెప్పుకొచ్చారు. కాంతార ప్రీక్వెల్ ను కూడా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నామని ఆయన వెల్లడించారు.

సలార్ (Salaar) విషయంలో వ్యక్తమవుతున్న ఎన్నో సందేహాలకు విజయ్ చెక్ పెట్టారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా ఈ మూవీలో శృతి హాసన్ నటిస్తున్నారు. సలార్ మూవీని భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus