Dil Raju: ఫామ్ లో లేని దర్శకులతో దిల్ రాజు భారీ రిస్క్

చిన్న సినిమాలతో ఒకప్పుడు భారీగా లాభాలు అందుకుని మంచి సక్సెస్ రేట్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఎంతో మంది నిర్మాతలు వస్తున్నారు మరి కొన్నాళ్ళకి రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఏళ్లు గడుస్తున్నా కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా బిగ్ బడ్జెట్ సినిమాలు వైపు ఫోకస్ చేస్తుండడం విశేషం. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల వైపు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.

కేవలం టాలీవుడ్ స్టార్ హీరోలతోనే తోనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విజయ్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా కోసం దిల్ రాజు భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పైడిపల్లి చివరగా చేసిన మహర్షి సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే విజయాన్ని అందుకోలేదు.నేషనల్ అవార్డ్ వచ్చింది కానీ కమర్షియల్ గా సినిమా అయితే అనుకున్నంతగా లాభాలను అందించలేదు.

ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం దిల్ రాజు 170 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. ఇక మరోవైపు శంకర్ తో కూడా పెద్ద రిస్క్ చేస్తున్నట్లు టాక్ అయితే వస్తుంది. శంకర్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకొని చాలా కాలం అవుతోంది. ఆయన చివరిగా రోబో తర్వాత మళ్ళీ ఏ సినిమాతో కూడా ఆ స్థాయిలో హిట్ అందుకోలేదు. పైగా సెట్స్ పైకి వచ్చిన సినిమాలు కూడా ఆగిపోతున్నాయి. మరి అలాంటి దర్శకుడితో దిల్ రాజు ఎలాంటి విజయాల్ని అందుకుంటారో చూడాలి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus