Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » చాలా కాలం తరువాత వస్తున్న అందమైన సినిమా ‘శాంతల’: ప్రముఖ నిర్మాత కె. యస్. రామారావు

చాలా కాలం తరువాత వస్తున్న అందమైన సినిమా ‘శాంతల’: ప్రముఖ నిర్మాత కె. యస్. రామారావు

  • July 1, 2023 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చాలా కాలం తరువాత వస్తున్న అందమైన  సినిమా ‘శాంతల’: ప్రముఖ నిర్మాత కె. యస్. రామారావు

కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన పిరియాడికల్‌ చిత్రం ‘శాంతల’. యిర్రంకి సుబ్బలక్ష్మి సమర్పణలో ఇండో అమెరికన్‌ ఆర్ట్స్‌ పతాకంపై నూతననటుడు నిహాల్‌ కోదాటి హీరోగా, ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌లో అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకున్న ఆశ్లేష ఠాకూర్‌ హీరోయిన్‌గా శేషు పెద్దిరెడ్డి దర్శకత్వంలో డా.యిర్రంకి సురేష్‌ నిర్మించారు. “సీతారామం” వంటి బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్‌ అందించిన విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ చేయడం విశేషం. ఈ సినిమాలోని రెండు పాటలను హైదరాబాద్‌ లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో శనివారం మీడియాకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ పాత్రికేయుతో ముచ్చటించారు.

ముందుగా దర్శకుడు శేషు మాట్లాడుతూ…
ఈ కథను నేను కే.ఎస్‌. రామారావుగారికి చెప్పగానే, ఆయన చాలా బాగుంది శేషు, పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేసి తీసుకురా.. నేను తీస్తాను అన్నారు. దాదాపు సంవత్సరంన్నర తిరిగాను. నన్ను నమ్మి ఈ అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలోని అన్ని క్రాఫ్ట్‌ల విషయంలో ఆయన కేర్‌ తీసుకుని, ఇలా చేయాలి.. అలా చేయాలి అంటూ సలహాలు ఇస్తూ.. సినిమా అద్భుతంగా రావటానికి కారకులయ్యారు. ఇందుకు ఆయనకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను అన్నారు.

డీఓపీ రమేష్‌ ఆర్‌ మాట్లాడుతూ…
నాకు ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన నిర్మాత కె.యస్‌. రామారావు గారికి, దర్శకులు శేషు గారికి థ్యాంక్స్‌. సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు.

ఎడిటర్‌ శశాంక్‌ ఉప్పుటూరి మాట్లాడుతూ…
ఇది నాకు తొలి అవకాశం అయినా దర్శకులు శేషు గారు, నిర్మాత రామారావు గారు నాకు కావాల్సినంత ఫ్రీడం ఇచ్చారు. అలాగే నాకు సహకరించిన ఇతర టెక్నీషియన్స్‌ అందరికీ రుణపడి ఉంటాను అన్నారు.

సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ…
ఈ సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు గర్వంగా ఫీలవుతున్నాను. ఇది సంగీతం, నృత్యం కలగలిపిన క్లాసికల్‌ మ్యూజిక్‌ మూవీ. దర్శకులు శేషుగారు ఈ స్క్రిప్ట్‌ విషయంలో చాలా క్లారిటీగా ఉండటం వల్ల నాకు మంచి సంగీతం ఇవ్వడం ఈజీ అయ్యింది. తెలుగు సినిమాకు పిల్లర్స్‌ వంటి వ్యక్తుల్లో ఒకరైన కె.యస్‌. రామారావు గారి సినిమాలో నేను పనిచేయడం నిజంగా గర్వంగా ఫీలవుతున్నా. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు అందరూ చాలా కష్టపడి పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు అన్నారు.

హీరో నిహాల్‌ మాట్లాడుతూ…
మా టీం అందరూ ఎక్కువ పనిచేస్తారు.. తక్కువగా మాట్లాడతారు. ఇది నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న సినిమా. రామారావు గారి ఆఫీస్‌లో శేషుగారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్‌ అయ్యాను. ఈ సినిమాలో నేను భాగం అయినందుకు హ్యాపీగా ఉంది. ఇది పాత, కొత్త నటులు, టెక్నీషియన్స్‌ కలయికలో వస్తున్న సినిమా. కె.యస్‌. రామారావు గారు వంటి లెజెండ్‌ మా వెనకాల ఉండటం మాకు మరింత ధైర్యాన్నిచ్చింది. సీతారామం వంటి బ్లాక్‌ బస్టర్‌కు సంగీతం అందించిన విశాల్‌ చంద్రశేఖర్‌ గారు మా సినిమాకు సంగీతం సమకూర్చడం చాలా చాలా లక్కీగా ఫీలవుతున్నా. హీరోయిన్‌ అశ్లేష తెలుగు రాకపోయినా ప్రతి డైలాగ్‌ను రాసుకుని, దాని అర్ధం తెలుసుకుని మరీ నటించింది. ఇది ఆమె క్యారెక్టర్‌ చుట్టూ తిరిగే సినిమా అన్నారు.

హీరోయిన్‌ అశ్లేష ఠాకూర్‌ మాట్లాడుతూ…
చిన్నప్పటి నుంచీ నాకు డాన్స్‌, సింగింగ్‌ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో నా ఇష్టాలకు దగ్గరైన పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ పాత్రను చాలెంజ్‌గా తీసుకుని మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్‌ చేశాను. లెజెండ్‌ కె.యస్‌. రామారావు గారి ప్రొడక్షన్‌లో, శేషు గారి దర్శకత్వంలో చేయడం గర్వంగా ఉంది. మంచి ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ ఇది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాను అన్నారు.

కె.యస్‌. రామారావుగారు మాట్లాడుతూ…
అమెరికాలో ఉన్న ఈ సినిమా నిర్మాతలకు కథ నచ్చడంతో మేము అక్కడికి చేయడం కష్టం కాబట్టి మీరే ఆ బాధ్యతలు తీసుకోవాలి అన్నారు. ప్రస్తుతం చిన్న సినిమాల సక్సెస్‌ రేట్‌ బాగాలేనందున ముందు నేను దానికి ఇంట్రస్ట్‌ చూపలేదు. కానీ వారికి మాత్రం ఓటీటీలో అయినా ఎంతో కొంత వర్కవుట్‌ కాకపోతుందా అని నమ్మకం. అయితే మీ సారధ్యం లోనే ముందుకు వెళ్తాం. మీరే ఈ ప్రాజెక్ట్‌ను నడిపించాలి అన్నారు. శేషు కూడా సంవత్సరం పైగా నా చుట్టూ తిరిగాడు. సబ్జెక్ట్‌ బాగుంది. సబ్జెక్ట్‌లో ఏదో కొత్తదనం ఉంటే చిన్న సినిమాలు సూపర్‌ సక్సెస్‌ అవుతాయనేది అందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతోనే నేను కూడా ఈ టీమ్‌తో కలిశాను. శేషు మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మా బ్యానర్‌లో క్రిమినల్‌ దగ్గర నుంచి పని చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్‌ దగ్గర పనిచేసి వచ్చాడు. శేషు ఎంత కష్టపడి, ప్రేమించి తీశాడో.. సినిమా కూడా అంత బాగా వచ్చింది. చాలా బాగుంది. చాలాకాలం తర్వాత వస్తున్న అందమైన చిన్న సినిమా ఇది. శేషుతో పాటు డీఓపీ రమేష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ విశాల్‌ చంద్రశేఖర్‌లు చాలా కష్టపడ్డారు. మూజిక్‌, కంటెంట్‌, విజువల్‌గా అద్భుతం అనిపించే సినిమా. హీరో, హీరోయిన్‌ పెయిర్‌ కూడా చాలా అందంగా ఉంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళం మొత్తం 6 లాంగ్వేజెస్‌లో చేశాం. సినిమా మీద మా నమ్మకానికి ఇదో మంచి ఉదాహరణ. ఈ సినిమాను మీడియా కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నా అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K S Rama Rao
  • #santhala

Also Read

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

related news

trending news

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

15 mins ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

2 days ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

2 days ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

2 days ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version