యంగ్ హీరో నాని తో జెంటిల్ మాన్ సినిమాలో పోటీపడి నటించి ప్రశంసలు అందుకున్న భామ నివేత థామస్. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ వర్గాలను తన వైపు తిప్పుకుంది. ఎన్నో ఆఫర్లు వస్తున్నా తాను స్కిన్ షో కి దూరమంటూ కొన్ని ప్రాజెక్ట్ లకు మాత్రమే సైన్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమాలో అవకాశం వచ్చినా ఎక్స్ పోజింగ్ విషయంలో తన పరిధులను చెప్పి ఆ చిత్ర దర్శకుడు వక్కంతు వంశీ ని ఆశ్చర్య పరిచింది.
వారు ఆ అమ్మాయిని తీసుకోవాలా? వద్దా? అనే ఆలోచనలోపడ్డారు. తాజాగా నివేత నిర్మాతల ఆగ్రహానికి గురి అయింది. ప్రస్తుతం ఆమె నవీన్ చంద్ర తో కలిసి “జూలియట్ – లవర్ ఆఫ్ ఇడియట్” అనే సినిమాలో నటిస్తోంది. ఇందుకోసం కేరళ కుట్టిని డేట్స్ ఎక్కువగా కావాలని ఆ చిత్ర నిర్మాతలు కోరేసరికి తొలుత ఒప్పుకోలేదు. దీంతో సదరు నిర్మాత దక్షిణ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. నివేత డేట్స్ ఇవ్వకుంటే దక్షిణాది సినిమాల్లో నటించకుండా నిర్ణయం తీసుకోవాలని మండలి పెద్దలు అనుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె ముందు ఉంచగా కెరీర్ కు నష్టం కలుగుతుందని భావించి అదనంగా కాల్ షీట్స్ ఇచ్చింది.
జెంటిల్ మాన్ సినిమాతో నివేత టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరుతుందని భావించిన వారంతా ఆమె పనులను చూసి అవాక్ అవుతున్నారు. ఇలా చీటికీ మాటికీ వార్తల్లో ఎక్కితే కెరీర్ కి ఇబ్బందేనని సూచిస్తున్నారు. మరి నివేత ఇక నుంచి అయినా జాగ్రత్తగా నడుచుకుంటుందో.. లేదో చూడాలి.