గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి ‘రంగస్థలం’ వంటి మరో కల్ట్ క్లాసిక్ వస్తే చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ కోరిక తీర్చేలా డైరెక్టర్ బుచ్చిబాబు సాన ‘పెద్ది'(Peddi) అనే విలేజ్ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి బయటకు వస్తున్న ఒక్కో అప్‌డేట్ అంచనాలను భారీగా పెంచేస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా పంచుకున్న ఇన్‌సైడ్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
తన 10 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో స్టోరీలు విన్నా.. ‘పెద్ది’ కథ వినగానే తాను 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయానని అవినాష్ చెప్పారు. ఆ ఎమోషన్‌కు కనెక్ట్ అయి మైండ్ బ్లాంక్ అయిపోయిందట. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్ కళ్లలో కచ్చితంగా నీళ్లు తిరుగుతాయని అతను గ్యారెంటీ ఇస్తున్నారు.ఇది 1970-80ల నాటి విజయనగరం నేపథ్యంలో సాగే కథ. పెద్ద స్టార్ కాస్ట్ కావడంతో రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం కష్టం.
అందుకే ఏకంగా 24 భారీ సెట్స్, 60కి పైగా సెటప్స్ వేశారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే.. అవి సెట్స్ అని ఏ ఒక్కరూ పసిగట్టలేరట. నేచురల్ లైటింగ్‌లోనే ఓపెన్ గ్రౌండ్స్‌లో షూట్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ పాడుబడిన బంగ్లాలో ఏకంగా ఓ హిల్ స్టేషన్ ఊరినే సృష్టించడం విశేషం. కెమెరామెన్ రత్నవేలుకి, ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు అదిరిపోయే సింక్ కుదరడంతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో వచ్చాయని ధీమా వ్యక్తం చేశారు అవినాష్.
ఇదొక రూరల్ స్పోర్ట్స్ డ్రామా. క్రికెట్ అనగానే ‘లగాన్’ గుర్తొస్తుంది కానీ.. ఇది పక్కా లోకల్. పొలం గట్ల మీద కూర్చుని మన ఊర్లో మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందట. చరణ్ వాడే బ్యాట్ కూడా పక్కా దేశీ స్టైల్‌లో డిజైన్ చేశారు. అలాగే ఎవరూ ఊహించని విధంగా ఓ అండర్ గ్రౌండ్ కుస్తీ సెటప్ వేశారట. ఒక గ్లింప్స్‌లో చరణ్ గద పట్టుకుని కనిపించిన పవర్‌ఫుల్ షాట్ తీసింది అక్కడేనట.ఈ కుస్తీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న టైమ్‌లోనే చరణ్‌కు గాయాలయ్యాయని అవినాష్ తెలిపారు.
అయినా సరే ఆ నొప్పిని భరిస్తూ, ఇతర ఆర్టిస్టుల డేట్స్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఆయన వెంటనే మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారట. ఆయన చూపించిన ఆ డెడికేషన్, కథలో ఉన్న బలం వల్లే.. సుకుమార్ చెప్పినట్లు ఈ మూవీలో చరణ్ యాక్టింగ్ ‘రంగస్థలం’ను మించిపోవడం పక్కా అని అవినాష్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు.