స్పైడర్ ట్రైలర్ కి హంగులు జోడిస్తున్న నిపుణులు
- August 22, 2017 / 09:34 AM ISTByFilmy Focus
కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న “స్పైడర్” పై భారీ క్రేజ్ ఉందని “గిల్మ్ప్స్ ఆఫ్ స్పైడర్” రిలీజ్ సమయంలోనే స్పష్టమైంది. అనంతరం మహేష్ పుట్టిన రోజు కి విడుదలైన టీజర్ అత్యంత వేగంగా 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ట్రైలర్ తో సినిమాపై మరింత క్రేజ్ తీసుకురావాలని మురుగదాస్ బృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎడిటింగ్ పూర్తి చేసుకున్న ట్రైలర్ రీరికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ దశలో ఉందని సమాచారం. నిపుణులు హంగులు జోడిస్తున్నారని తెలిసింది. వచ్చే నెల 9 వ తేదీన చెన్నైలో జరిగే ఆడియో వేడుకలో ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.
అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ పాటను రేపటి నుంచి మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ పై రొమేనియాలో చిత్రీకరించనున్నారు. మహేష్ ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














