టాలీవుడ్ టాప్ హీరోలు అయిన మెగా స్టార్ చిరంజీవి….నందమూరి నట సింహం బాల కృష్ణ బాక్స్ ఆఫీస్ వార్ కి రంగం సిద్దం అవుతున్న తరుణంలో రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది…ఎలా అయినా 2017లో తమ హీరో సినిమానే సూపర్ హిట్ కావాలి అని, తమ అభిమాన హీరో సినిమా ప్రమోషన్ ను భారీగా చేసేందుకు రెడీ అయ్యారు…అందులో భాగం గానే సరికొత్త పధకాలతో ముందుకు సాగుతున్నారు…ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే కాస్త రచ్చగా మారడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి…విషయంలోకి వెళితే…ఖైదీ-శాతకర్ణిలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డానికి ఇంకా పది రోజులకు పైగా టైమ్ ఉంది అన్న సంగతి పక్కన పెడితే…ఫ్యాన్స్ ప్రమోషన్ హంగామా స్టార్ట్ చేసేసారు ముఖ్యంగా…హోర్డింగ్ ల ఏర్పాటు విషయంలో విపరీతమైన హంగామా నడుస్తోందని తెలుస్తోంది. ఆయా హోర్డింగ్ కంపెనీల యజమానులతో.. ప్రైమ్ స్పాట్ లో హోర్డింగ్ తమదే ఉండాలని పట్టు పడుతున్నాయట ఇరు వర్గాలు.
ఎటు తేల్చుకోవాలో అర్ధంకాని పరిస్థితి పబ్లిసిటీ కంపెనీలకు ఏర్పడుతోంది. హైద్రాబాద్ తో పాటు ప్రధాన పట్టణాల్లోని అన్ని ఏరియాల్లోనూ ఇదే సిట్యుయేషన్ అంటున్నారు. అయితే పట్టణాల్లో పరిస్తితే ఇలా ఉంటే…పల్లెల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని తెలుస్తుంది…అసలే సంక్రాంతి సమరం…అందులోనూ ఇద్దరు బడా హీరోలు తలపడుతున్న క్రమంలో ఎలా అయినా తమ హీరో సినిమా సూపర్ హిట్ కావాలి అన్న ఆలోచనతో పల్లె వీదులన్నీ బడా బ్యానర్స్ తో నింపేందుకు అభిమానులంతా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు….మరి సినిమా ప్రమోషన్ విషయంలోనే ఇలా ఉంటే….ఇక సినిమా విడుదలయిన తరువాత మ్యాటర్ ఎలా ఉంటుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.