“2019లో గనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే నేను సెవెనో క్లాక్ బ్లేడ్ తో పీక కోసుకొని సూసైడ్ చేసుకొంటా” అని బండ్ల గణేష్ ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై అందరూ నవ్వుకొన్నారు కానీ.. తన తోటి కమెడియన్ మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయిన 30 ఇయర్స్ పృధ్వీ మాత్రం ఎద్దేవా చేశాడు. అర్జెంట్ గా బండ్ల గణేష్ ను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే నేను ముందుగా.. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. బండ్ల గణేష్ ఆత్మహత్య చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పృధ్వీ ఒక ఇంటర్వ్యూలో కాస్త వెటకారంగా చెప్పడం గమనార్హం.
పృధ్వీ ఈ తరహాలో వ్యంగ్యంగా రెస్పాండ్ అవ్వడం మొదటిసారేమీ కాదు. అయితే.. బండ్ల గణేష్ మీద ఇలా రెస్పాండ్ అవ్వడం అనేది చర్చనీయాంశం కానుంది. పైగా.. ఇప్పుడు బండ్ల గణేష్ ఉన్న ఫామ్ కి పృధ్వీ కామెంట్స్ ను లైట్ తీసుకొనే పరిస్థితి కనిపించడం లేదు. సొ, ఈ ఇష్యూ మీద బండ్ల ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.