‘పవన్ 27’ పై అసలైన క్లారిటీ వచ్చేసింది…!

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘వకీల్ సాబ్’ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే 55 శాతం షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన భాగాన్ని లాక్ డౌన్ పూర్తవ్వగానే పూర్తి చేయనున్నారు. దసరా లేదా సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం చేస్తూనే మరో పక్క క్రిష్ డైరెక్షన్లో పవన్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పవన్ కు 27 వ చిత్రం. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది.

కోహినూర్ వజ్రం నేపధ్యంలో పీరియడికల్ మూవీ గా ఈ చిత్రం ఉంటుందని ప్రచారం నడుస్తుంది. ఓ గజదొంగ పాత్రలో పవన్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి మొదటి నుండీ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. మొదట ఆర్ధిక ఇబ్బందులు వల్ల ఈ ప్రాజెక్ట్ డౌట్ అని ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని తెలుస్తుంది. తరువాత ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా నటిస్తున్నాడు అని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లతో శివ కార్తికేయన్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఏ తెలుగు సినిమాకి సైన్ చెయ్యలేదు అని శివ కార్తికేయన్ సన్నిహిత వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారని ప్రచారం నడిచింది. కానీ ఆమె కూడా ఎటువంటి తెలుగు సినిమాకి కమిట్ కాలేదు అని సమాచారం.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus