Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ భార్య కొత్త కారు ఖరీదెంతో మీకు తెలుసా?

పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) మరణించి రెండు సంవత్సరాలు అవుతున్నా చాలామంది అభిమానులను ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. పునీత్ రాజ్ కుమార్ మనుషుల్లో దేవుడని ఏ మాత్రం పబ్లిసిటీ చేసుకోకుండా ఎంతోమంది సహాయం చేశారని ఆయన మరణించిన సమయంలో కామెంట్లు వినిపించాయి. సేవా కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే సాధారణ విషయం కాదనే సంగతి తెలిసిందే. పునీత్ మరణం అనంతరం ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలను అశ్విని నిర్వహిస్తున్నారు.

సినిమా కార్యక్రమాలలో పాల్గొంటూ, సినిమా పనుల్లో నిమగ్నమవుతూ ఆమె అభిమానులకు దగ్గరవుతున్నారు. అయితే అశ్విని తాజాగా కొత్త కారును కొనుగోలు చేయగా కొత్త కారు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అశ్విని కొన్న కారు ఆడి క్యూ7 కాగా ఈ కారు ఆన్ రోడ్ ధర కోటీ 10 లక్షల రూపాయలు అని సమాచారం. 2019 సంవత్సరంలో పునీత్ రాజ్ కుమార్ తన భార్య అశ్వినికి మహిళా దినోత్సవం రోజున 5 కోట్ల రూపాయల కారును గిఫ్ట్ గా ఇచ్చారు.

అంతకు ముందు కూడా జాగ్వార్ కారును తన భార్యకు పునీత్ రాజ్ కుమార్ బహుమతిగా ఇచ్చారు. అశ్విని ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. పునీత్ సగంలో వదిలేసిన పనులను ఆమె పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లలో కొన్ని ప్రాజెక్ట్ లు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది.

అశ్విని కొన్న కారు లీటర్ పెట్రోల్ కు 14 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ఈ కారులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ కారు గంటకు 250 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలుస్తోంది. అశ్విని పునీత్ లక్ష్యాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus