The RajaSaab: 5వ రోజు మరింత డౌన్ అయిపోయిన ‘ది రాజాసాబ్’..ఇక పండుగ హాలిడేస్ పైనే ఆశలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ‘ది రాజాసాబ్'(The RajaSaab) అనే పాన్ ఇండియా మూవీ రూపొందింది. నిధి అగర్వాల్,మాళవిక మోహనన్,రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, జరీనా వాహాబ్ వంటి బాలీవుడ్ నటులు కూడా అత్యంత కీలక పాత్రలు పోషించారు.తమన్ సంగీత దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.

The RajaSaab

సినిమా పై బజ్ ఏమీ క్రియేట్ చేయలేదు. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ప్రీమియర్ షోల నుండే నెగిటివ్ రెస్పాన్స్ ను మూటగట్టుకుంది.

సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్లో జరిగింది. అయితే విచిత్రంగా టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు రూ.100 కోట్ల పైగా గ్రాస్ ను కొల్లగొట్టి రికార్డు కొట్టింది ‘ది రాజాసాబ్’.విచిత్రంగా 2వ రోజు కూడా సినిమా బాగా హోల్డ్ చేసింది. కానీ 3వ రోజు నుండి కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి. 4వ రోజు మరింత దారుణం అనే చెప్పాలి.5వ రోజు కూడా అంతే..! ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 27.80 cr
సీడెడ్ 9.18 cr
ఉత్తరాంధ్ర 8.56 cr
ఈస్ట్ 6.82 cr
వెస్ట్ 4.50 cr
కృష్ణా 4.44 cr
గుంటూరు 4.62 cr
నెల్లూరు 2.63 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 68.55 cr
కర్ణాటక+తమిళనాడు+కేరళ 5.95 cr
నార్త్ 14.60 cr
ఓవర్సీస్ 16.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 105.6 cr

‘ది రాజాసాబ్’ చిత్రానికి అన్ని వెర్షన్లు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.249.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.250 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే తర్వాత బిజినెస్లో జరిగిన అడ్జస్ట్మెంట్ల కారణంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.210 కోట్లుగా ఫిక్స్ అయ్యింది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.105.6 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా రూ.174 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.104.4 కోట్ల షేర్ ను రాబట్టాలి. పండుగ 2 రోజుల్లో మినహా.. తర్వాత ఈ సినిమా నిలబడటం అయితే అన్ని రకాలుగా కష్టమే.

‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus