Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

నవీన్ పోలిశెట్టి హీరోగా మారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది ఈ సినిమా.

Anaganaga Oka Raju

టీజర్, ట్రైలర్స్ వంటివి ఆకట్టుకోవడం.. అలాగే నవీన్ పోలిశెట్టి వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉండటం పైగా ప్రమోషనల్ కంటెంట్లో సంక్రాంతి పండుగ వైబ్స్ ఉండటంతో.. ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు పెరిగాయి.

అందువల్ల థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 7.5 cr
సీడెడ్ 2.5 cr
ఆంధ్ర(టోటల్) 9 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 cr
ఓవర్సీస్ 6.5 cr
టోటల్ వరల్డ్ వైడ్ 27 కోట్లు

‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) సినిమాకి రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.28 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. లేదు అంటే ‘మన శంకర వరప్రసాద్ గారు’ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి సినిమాలు ఆడియన్స్ కి ఆప్షన్ గా ఉన్నాయి.

శర్వానంద్ ఖాతాలో ‘సామజవరగమన’ లాంటి హిట్టు పడిందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus