“పూరి ఇంటిపై “లోఫర్” సినిమా డిస్ట్రిబ్యూటర్లు దాడికి దిగారని, వారిపై పూరి పోలీస్ స్టేషన్ లో కేసు వేశాడని” గత రెండ్రోజులుగా మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తూ వచ్చాయి.
కట్ చేస్తే.. అసలు తాము పూరి ఇంటిపై దాడి చేయనేలేదని, పూరి కావాలనే తమపై అబద్దపు కేసులు వేసాడని, తాము “లోఫర్” నష్టాలు పూడ్చమనే అభ్యర్ధను మాత్రమే పూరి దృష్టికి తీసుకెళ్లామని డిస్ట్రిబ్యూటర్లు సోమవారం, హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దాంతో.. ఇప్పటివరకూ ఈ గొడవలపై కవరేజ్ ఇస్తున్న మీడియా వారు “ఏది నిజం, ఏది అబద్ధం” అనే సందిగ్ధంలో పడ్డారు!