స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో చాలా స్పీడ్ గా ఉంటాడు. అమ్మాయిని చూడాగానే ఐ లవ్ యూ చెబుతాడు. అమ్మాయి నచ్చిన వెంటనే ముద్దు అడుగుతాడు. మొహమాటం, సిగ్గు, భయం ఇవేమి పూరి హీరోకి దరిదాపుల్లోకి రావు. బిజినెస్ మ్యాన్ సినిమాలో “ఐ లవ్ బ్యాడ్ బాయిస్” అంటూ ఐటెం సాంగ్ పెట్టి అమ్మాయిలకు బ్యాడ్ బాయిస్ ఇష్టమంటూ చెప్పించారు. మరి ఇంతకీ మీరు బ్యాడ్ బాయా, గుడ్ బ్యాయా? అని ఓ ఇంటర్వ్యూ లో ఈ డైరక్టర్ ని అడగగా…
ఆయన మాట్లాడుతూ “నేను తరచూ బ్యాంకాక్ కి వెళ్లడం, అక్కడే షూటింగ్ ప్లాన్ చేయడం వల్ల, అక్కడి అమ్మాయిలతో నేను శృంగారంలో పాల్గొంటాను అని కొందరు నమ్ముతుంటారు. వారి ఊహలే వాస్తవాలని అనుకుంటుంటారు. అందులో కొంచెం కూడా నిజం లేదు. ఇప్పటి వరకు నేను ఏ థాయిలాండ్ అమ్మాయితో సెక్స్ లో పాల్గొనలేదు” అని వివరించారు. బ్యాంకాక్ లో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ తనకి నచ్చుతాయని, థాయ్ ప్రజలు మనసులో ఎటువంటి కుళ్లు పెట్టుకోకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని… అందుకే తాను బ్యాంకాక్ కి వెళుతానని చెప్పారు. పూరి జగన్నాథ్ తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన ” ఇజం” చిత్రం ఈ శుక్రవారం (అక్టోబర్ 21) విడుదల కానుంది.