ఏదైనా కొత్తగా బోల్డ్ గా ఆలోచించే దర్శకుడు పూరి జగన్నాధ్ తీరు చాల మందికి నచ్చుతుంది. ఫ్యాన్ బేస్ కలిగిన అతికొద్దిమంది దర్శకులలో పూరి జగన్నాధ్ ఒకరు. పూరి అందరిలాగా ఆలోచించడు అదే అతని ప్రత్యేకత. ఆ విషయం ఆయన సినిమాలు చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది. కాగా పూరి తన ఆలోచనలను, ప్రేక్షకులకు చెప్పాలనుకున్న విషయాలను సినిమాల ద్వారా చెప్పలేక పోతున్నానని అనుకున్నారేమో మ్యూసింగ్స్ పేరుతో కొన్ని అద్భుతమైన టాపిక్స్ పై తన వాణి వినిపిస్తున్నారు.
ఇప్పటికే పూరి అనేక విషయాలపై మాట్లాడగా తాజాగా బ్రేక్ అప్ గురించి మాట్లాడాడు. బ్రేక్ అప్ అనేది మంచి విషయం. లవ్ మనిషిని వీక్ చేస్తుంది, కానీ బ్రేక్ స్ట్రాంగ్ గా మారుస్తుంది. బ్రేక్ అప్ అయితే చాలా మంది ఏడ్చేస్తారు, ఇగో ఎక్కువ ఉన్నవాళ్లు మరీ ఎక్కువగా ఏడ్చేస్తారు. ఎవరైనా ఓదారుస్తుంటే సింపథీ బాగుందని మరింత ఏడుస్తారు. అసలు బ్రేక్ అప్ అయితే భాదపడొద్దు. ఫ్రెష్ గా స్నానం చేసి ఓ పెగ్ వేసుకొని పడుకోండి, నెక్స్ట్ డే నుండి ఆ పెంట జోలికి వెళ్ళకండి .
ఐనా ప్రేమికులు లేచిపోవడానికి పేరెంట్స్ కారణం, వారిద్దరిని పేరెంట్స్ వదిలేస్తే కొన్నాళ్ళు తిరిగి విడిపోతారు. వాళ్ళ గురించి వాళ్లకు తెలిసిన వెంటనే బ్రేక్ అప్ అయిపోతారు. కాబట్టి కొన్నాళ్ళు అలా తిరగనివ్వండి వాళ్లే బ్రేక్ అప్ చెప్పుకుంటారు అని పూరి చెప్పుకొచ్చారు.