డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో తీసిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ థియేటర్లలోకి ఎంత త్వరగా వచ్చిందో అంతే త్వరగా వన్ వీక్‌లోనే వాషౌట్ అయిపోయింది. కానీ పూరికి కొత్త కష్టాలు, తలనొప్పులు తెచ్చిపెట్టింది. భారీ అంచనాలతో వచ్చిన మూవీ దారుణంగా ఫెయిల్ అవడంతో నష్టపోయిన డబ్బు ఇమ్మని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పూరి మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పంపిణీ రంగానికి చెందిన ఓ వ్యక్తి పూరితో ఫోన్ లో జరిపిన సంభాషణ తాలుకు కాల్ రికార్డింగ్ బయట పెట్టడంతో ఫిలిం సర్కిల్స్, మీడియా అండ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
‘‘ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?.. నేను ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు.. అయినా ఇస్తున్నాను.. ఎందుకు?.. పాపం వాళ్లు కూడా నష్టపోయారులే అని.. నేను ఆల్రెడీ బయ్యర్స్ తో మాట్లాడడం జరిగింది.. ఒక అమౌంట్ ఇస్తామని చెప్పాం.. వాళ్లు ఒప్పుకున్నారు.. నెలరోజులు టైం అడిగాను, ఎందుకంటే నాకు రావాల్సింది ఉంది.. ఇస్తాను అని చెప్పాక కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే.. ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు.. ‘పోకిరి’ దగ్గరినుండి ‘ఇస్మార్ట్ శంకర్’ దాకా.. బయ్యర్ల దగ్గరినుండి నాకు రావాల్సిన డబ్బులు ఎన్నో ఉన్నాయి..
బయ్యర్స్ అసోసియేషన్ అవి నాకు వసూలు చేసి పెడుతుందా?.. పెట్టదు కదా.. ధర్నా చేస్తామంటున్నారు కదా చెయ్యనీ.. ధర్నా చేసేవాళ్ల లిస్ట్ తీసుకుంటా.. వాళ్లకి తప్ప మిగతా వాళ్లందరికీ డబ్బులిస్తా’’.. అంటూ పూరి క్లారిటీగా చెప్పిన వాయిస్ నోట్ అందరూ విన్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.. ఆడియో లీక్ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ పూరి సడెన్‌గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫైనాన్షియర్ శోభన్, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనులపై కేసు పెట్టాడు.
శోభన్ పెద్ద పెద్ద సినిమాలకు ఫైనాన్స్ చేస్తుంటాడు. పూరి ఆడియో క్లిప్‌లో అతని పేరు కూడా చెప్పాడు. ఇక వరంగల్ శ్రీను నైజాం డిస్ట్రిబ్యూటర్.. వీరిద్దరి మీదే పూరి ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడనేది తెలియాల్సి ఉంది.. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఫైనాన్షియర్లు ఇక ముందు పూరి సినిమాలకు ఫైనాన్స్ చేసే ప్రసక్తే లేదంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి..