టాలీవుడ్ లో నట సింహం బాలయ్య బాబుతో ఒక్క హిట్ అందుకుంటే చాలు…ఇక ఆ డైరెక్టర్ దశ తిరిగినట్లే…ఎందుకంటే బాలయ్యను ఆయనకున్న నటన అనుభవాన్ని…హావ భావాలని పర్ఫెక్ట్ గా సిల్వర్ స్క్రీపై చూపించి హిట్ కొట్టడం అంటే…సాహసం అనే చెప్పాలి…ఇదిలా ఉంటే ఒకటి కాదు రెండు కాదు…దాదాపుగా 6 సినిమాలు బాలయ్య రేంజ్ కి తగ్గ సినిమాలు పడని రోజుల్లో…వరుస ఫ్ల్యాప్స్ తో బాలయ్య సతమతమవుతున్న రోజుల్లో టాలీవుడ్ లో సూపర్ హిట్ ను అందించే క్రమంలో సింహ అంటూ దూసుకు వచ్చాడు బోయపాటి..అంతే ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ తో చేరిపోయాడు మన బోయపాటి….అయితే అదే క్రమంలో కేవలం బాలయ్యకు హిట్టివ్వడమే కాకుండా… లుక్ పరంగా కూడా ఆయనకు ఒక మేకోవర్ ఇచ్చాడు బోయపాటి. ‘సింహా’ లో బాలయ్య లుక్ ఆ సమయానికి ‘ది బెస్ట్’ అనిపించింది అని అప్పటి విమర్శకులే ప్రశంసించారు.
అంతేకాదు ఆ తర్వాత మళ్లీ ‘లెజెండ్’ తో మరోసారి బాలయ్యకు పెద్ద హిట్ ఇచ్చాడు బోయపాటి. ఆసినిమాలో కూడా బాలయ్య లుక్ అదిరిపోతుంది…అయితే అటువంటి బోయపాటికి షాక్ ఇచ్చే విధంగా పూరి ‘పైసా వసూల్’ లో బాలయ్య లుక్ ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేలా అంటే…బాలయ్య హేర్ స్టైల్ మీసం గడ్డం అన్నీ కూడా చాలా శ్రద్ధగా పూరి ఈసినిమా కోసం సెట్ చేసాడా అని అనిపించేడట్లుగా ఈ స్టిల్స్ ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు బాలకృష్ణ మొఖంలో ఒక గ్లో కనిపిస్తోందని ఈమూవీలో బాలయ్య మేకప్ అదిరి పోవడంతో ‘సింహా’ ‘లెజెండ్’ సినిమాల్లో కంటే కూడా ‘పైసా వసూల్’ లో బాలయ్య లుక్ ఎక్కువమందిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు బాలయ్య లుక్ పరంగా మేకోవర్ అంటే ఆ క్రెడిట్ ఇన్నాళ్లూ బోయపాటికే దక్కితే ఇప్పుడు ఆ క్రెడిట్ పూరి తీసేసుకున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా చెప్పాలి అంటే బాలయ్య ఈ సినిమాలో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు అంటున్నారు ఆయన ఫాన్స్….మొత్తంగా చూసుకుంటే బాలయ్య లాంటి పవర్ఫుల్ హీరోకి పైసా వాసూల్ లాంటి సింపల్ టైటిల్ పెట్టి కాస్త నిరాశ పరిచిన పూరీ…లుక్ తో మాత్రం ఆదరగొట్టేశాడు అనే చెప్పాలి…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.