పూరీ ఇజం చెప్పిన టీజర్

టాలీవుడ్ కలక్షన్ల రికార్డులను తిరగరాసే సత్తా ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. అందుకే ఆయన సినిమాపై భారీ అంచనాలువుంటాయి. నందమూరి ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ తెరకెక్కిస్తున్న ఇజం  టీజర్ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయి అంచనాలను మరింత పెంచింది.

ఇందులో కళ్యాణ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. సాహసోపేతమైన ఛేజింగ్ లు, అదిరిపోయే ఫైట్లతో ఉన్న టీజర్ నందమూరి అభిమానులకు విపరీతంగా నచ్చింది. భారీ బడ్జెట్ తో తీసినట్లు టీజర్ చెప్పకనే చెబుతోంది. పూరీ తన ఇష్టమైన బ్యాంకాక్ లొకేషన్ ని వదిలి ఈ చిత్రం కోసం స్పెయిన్ కి వెళ్లారు. అక్కడే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వాటితోనే టీజర్ కట్ చేసి క్యూరియాసిటీ తెప్పించారు. ముఖ్యంగా టీజర్లో అంతా స్పెయిన్ భాష ఉపయోగించి కొత్త ఫ్లేవర్ అద్దారు. కళ్యాణ్ రామ్ కూడా స్పెయిన్లోనే మాట్లాడడం చూడవచ్చు. జగ్గు భాయ్, కళ్యాణ్ రామ్ బీడీ ఫ్రెండ్స్ గా పరిచయం చేసి ఆసక్తిని రేకెత్తించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus