పూరి మార్క్ లుక్ తో కళ్యాణ్ రామ్

  • June 3, 2016 / 01:37 PM IST

హీరోలను కొత్తగా చూపించడం దర్శకులకు అలవాటే. కాని పూరి జగన్నాధ్ హీరోలను కొత్తగా మారుస్తాడు. “సూపర్” సినిమా కోసం నాగార్జునని హాలీవుడ్ హీరోగా మలిచాడు. “దేశముదురు” చిత్రం కోసం అల్లు అర్జున్ ని సిక్స్ ప్యాక్ చేయించాడు. క్లాస్ హీరో అయిన మహేష్ ను పోకిరితో మాస్ గా మార్చాడు. బుడ్డా … హోగా తేరా బాప్ కోసం అమితాబ్ ని కూడా వదల్లేదు. తన సినిమాలో హీరో యాక్టివ్ గా, ట్రెండీగా ఉండాలని కోరుకుంటాడు. అలాగే లేటెస్ట్ గా వచ్చిన టెంపర్ మూవీ లో ఎన్టీఆర్ కొత్త లుక్ తో అదర గొట్టాడు.

ప్రస్తుతం డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ కళ్యాణ్ రామ్ కి అభిమానులను పెంచే పనిలో పడ్డాడు. ఫ్రెంచ్ గడ్డం, స్పెర్స్ పెట్టించి కళ్యాణ్ రామ్ కి న్యూ లుక్ తీసుకొచ్చాడు. ఈ నందమూరి హీరో పూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందుకు నిర్మాత కూడా కళ్యాణ్ రామే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం సిద్ధమైన గెటప్ లో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతమైన లైక్లు వచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో వేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ లో కళ్యాణ్ రామ్ తో పాటు హీరోయిన్ అదితి ఆర్య కూడా పాల్గొంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus