పోకిరి దర్శకత్వంలో తుంటరోడు!
- March 31, 2016 / 12:53 PM ISTByFilmy Focus
కథానాయకుడంటే “రాముడు మంచి బాలుడు” ఇమేజ్ నుంచి “వెధవ, పోకిరి” అనే స్థాయికి తీసుకొచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్. ఆయన సినిమాల్లో హీరోలు సాడిస్టుల్లా బిహేవ్ చేస్తుంటారు. అయినా కూడా జనాలకు నచ్చేస్తుంటారు. ఇప్పటివరకూ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకొంటూ “ఈ హీరో చాలా మంచోడండి” అనిపించుకుంటూ వచ్చిన నారా రోహిత్ కూడా బ్యాడ్ హీరో అనిపించుకోవడానికి సన్నద్ధమయ్యాడు.
అందుకే పూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది. వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సరైన స్టార్ డమ్ దక్కని కారణంగా రోహిత్ ఈ నిర్ణయానికొచ్చాడు. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాను తెరకెక్కిస్తున్న పూరి.. ఆ తర్వాత ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ లతో వరుస సినిమాలు చేయడానికి అంగీకరించి ఉన్నాడు. ఆ రెండు సినిమాల అనంతరం నారా రోహిత్ సినిమా ఉండొచ్చు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












