స్టార్ హీరో ఫ్యాన్స్ గురించి క్రేజీ కామెంట్స్ చేసిన పూరీ

  • July 23, 2019 / 01:01 PM IST

బాలకృష్ణ అనే కాదు ఎవరైనా హీరోయిన్ తన అభిమానిని కొట్టింది అనే వార్త వినగానే “ఈ స్టార్ హీరోహీరోయిన్స్ కి ఇదేం పిచ్చి.. అభిమానంతో కలవడానికి వచ్చిన ఫ్యాన్స్ ను కొడతారు?” అని మనం చాలా ఈజీగా తిట్టుకొంటామ్ కానీ.. బాలయ్య లేదా మిగతా హీరోయిన్లు ఫ్యాన్స్ ను కొట్టడం వెనుక కారణాన్ని పూరీ జగన్నాధ్ చాలా పర్ఫెక్ట్ గా వివరించాడు.

ఫ్యాన్స్ ఎగబడడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం మీద పడడం వంటివి చాలా క్యాజువల్ విషయాలు వాటిని ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోరు.. కానీ కొందరు శాడిస్ట్ ఫ్యాన్స్ ఉంటారు. హీరోయిన్ మీద పడి ఎక్కడపడితే అక్కడ టచ్ చేసి పైశాచిక ఆనందం పొందేవాళ్ళు కొందరు ఉంటే… ఇంకొందరు హీరోల బాల్స్ (మూత్ర పిండాలు) పట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే బాలయ్య ఎవరైనా దగ్గరకి రావడానికి ప్రయత్నిస్తే లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఈ ఫ్యాన్స్ కొందరు శాడిస్ట్ నా కొడుకులు” అని వివరించుకొచ్చాడు పూరీ. పూరీ చెప్పిన మాటల నిజం ఉన్నప్పటికీ.. మరీ దగ్గరకు వచ్చిన ప్రతి అభిమానిని అలా కొట్టడం మాత్రం కరెక్ట్ కాదేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus