Pushpa Teaser: ‘పుష్ప’ టీజర్.. తగ్గేదే లే..!

  • April 7, 2021 / 09:38 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న నూతన చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం టీజర్ ని వదిలారు. చెప్పిన టైమ్ కంటే ఆలస్యంగా టీజర్ ని రిలీజ్ చేసినప్పటికీ ఫ్యాన్స్ అంచనాలను మించే విధంగా ఈ టీజర్ ని కట్ చేశారు.

ఇప్పటివరకు అల్లు అర్జున్ మాస్ క్యారెక్టర్ లు చేశాడు కానీ ఈ సినిమాలో ఊర మాస్ లుక్ తో అలరించబోతున్నాడని టీజర్ చూస్తేనే అర్ధమవుతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే హీరో పోలీసులను తప్పించుకునే సన్నివేశాలను టీజర్ లో చూపించారు. బన్నీ మాస్ గెటప్ తో చిత్తూరు యాసలో ‘తగ్గేదే లే’ అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. సింగిల్ డైలాగ్ తో టెరిఫిక్ సీన్స్ తో క్రేజీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ని కట్ చేసి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌‌గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus