Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ధ్రువ సర్జా – రచితా రామ్ హరిప్రియల “పుష్పరాజ్” ట్రైలర్ రిలీజ్. ఆగస్టు 27న గ్రాండ్ రిలీజ్

ధ్రువ సర్జా – రచితా రామ్ హరిప్రియల “పుష్పరాజ్” ట్రైలర్ రిలీజ్. ఆగస్టు 27న గ్రాండ్ రిలీజ్

  • August 8, 2022 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధ్రువ సర్జా – రచితా రామ్ హరిప్రియల “పుష్పరాజ్” ట్రైలర్ రిలీజ్. ఆగస్టు 27న గ్రాండ్ రిలీజ్

ధ్రువ సర్జా, రచిత రామ్ హరిప్రియ జంటగా కన్నడ లో రూపొందిన ‘పుష్పరాజ్ ది సోల్జర్’ చిత్రాన్ని ఆర్. యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారద్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై బొడ్డు అశోక్, కె. రవీంద్ర కళ్యాణ్ లు సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 27న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్దమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర ఆడియోను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ,ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ లు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మూవీ మాక్స్ ఆధినేత శ్రీనివాస్, దర్శకుడు సూర్య కిరణ్, ఆదిత్య, తిరుపతి రెడ్డి , పుప్పా అంకంబరావు, రేణుక గారు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ట్రైలర్ విడుదల కార్యక్రమం అనంతరం

చిత్ర నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. క్రేజీ అంకుల్స్ తరువాత మేము తీసిన స్ట్రెయిట్ ఫిలిం “గోల్డ్ మ్యాన్” 10 డేస్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మేము విడుదల చేస్తున్న ఈ సినిమా విషయానికి వస్తే ఈ క్రెడిట్ అంతా రవీంద్ర కళ్యాణ్ కే చెందుతుంది.ఎందుకంటే తనే అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు.మూవీ మాక్స్ ద్వారా పుష్పరాజ్ సినిమాను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.తను రీసెంట్ గా విడుదల చేసిన మయోన్ సినిమా గొప్ప విజయం సాధించింది. తిరుపతి రెడ్డి గారి సినిమా తీస్ మార్ ఖాన్ కూడా బిగ్ హిట్ అవ్వాలి శ్రీహరి నాకు క్లాస్ మెట్ తనతో నేను ట్రావెల్ చేశాను. తను ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వాదిస్తాడని ఆశిస్తున్నాను.

అతిధిగా వచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయి సినిమా రంగంలో కూడా సక్సెస్ అవ్వాలని సినిమాలు తీస్తున్న వ్యక్తి బొడ్డు అశోక్ , ఎక్కడైతే క్రేజీ సినిమాలు ఉన్నాయో.. ఏ సినిమాలు అయితే గ్యారెంటీ గా ఆడతాయని అనుకుంటాడో దాన్ని దృక్పని లాగా అంటే ఆయస్కాంతంలా వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆలా ఆయస్కాంతంలా దొరికిన ఈ సినిమా మంచి సినిమాలా కనిపిస్తుంది. వీరిద్దరూ కలసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న “పుష్పరాజ్” టైటిల్ చూస్తుంటే చార్లెస్ శోభరాజ్, అల్లు అర్జున్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కమర్సియల్ గా చూసుకుంటే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.ఇదే హీరో తెలుగులో చేసిన పొగరు సినిమా కూడా బాగా ఆడింది.హీరో ధ్రువ సర్జా ను చూస్తుంటే అర్జున్ గారు వయసులో ఉన్నప్పుడు మా పల్లెలో గోపాలుడు టైమ్ లో ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆలాగే ఉన్నాడు.అలాగే హీరోయిన్ పిల్ల జమిందార్, బాలకృష్ణ గారితో జై సింహ సినిమాలతో మంచి హిట్ కొట్టిన హరిప్రియ, ధ్రువ సర్జా తో కలసి నటిస్తుంది.రామసత్య నారాయణ చెప్పినట్లు అందరూ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా యాడ్స్ ఇవ్వండి సినిమా సక్సెస్ చేసుకొండి. “దశావతారం” తరువాత హిట్స్ కోసం ఎదురు చూస్తున్న కమలహాసన్ గారు విక్రమ్ సినిమాను ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకొని పబ్లిసిటీ క్లీయరెన్స్, సెన్సార్ కంప్లీట్ చేసుకొన్న “విక్రమ్” పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాలు కూడా కౌన్సిల్ నుండి యాడ్స్ వేసుకొని వెళ్లారు ఆ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. కాబట్టి ఈవాళ కౌన్సిల్ సక్సెస్ కు ఒక సెంటిమెంట్ లా మారిపోయింది. కౌన్సిల్ లో యాడ్స్ వేసినా, టైటిల్ రిజిస్టర్ చేసినా,పబ్లిసిటీ క్లీయరెన్స్, సెన్సార్ కంప్లీట్ చేసుకున్నా హిట్ అవుతుంది అనే నమ్మకం ఏర్పడింది.ఈ పుష్పరాజ్ సినిమా కూడా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరుపున యాడ్స్ వేసి హిట్ కు కారణామవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

అతిధిగా వచ్చిన దర్శకుడు సూర్య కిరణ్ మాట్లాడుతూ.. కన్నడలో సూపర్ హిట్ అయ్యి ఎంతో పేరు తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో కూడా అంతే విజయం సాదించి మా నిర్మాతలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మరో నిర్మాత రవీంద్ర కళ్యాణ్ మాట్లాడుతూ..మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ఈ సినిమాను ఆర్. యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్,గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై బొడ్డు అశోక్ గారితో కలసి తెలుగులో విడుదల చేస్తున్నాము.మూవీ మాక్స్ ద్వారా పుష్పరాజ్ సినిమాను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.తను రీసెంట్ గా విడుదల చేసిన మయోన్ సినిమా గొప్ప విజయం సాధించింది.ఈ నెల 27 న గ్రాండ్ గా విడుదల అవుతున్న మా పుష్పరాజ్ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

అతిధిగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ..ఈ సినిమా పుష్పరాజ్ అనే టైటిల్ లోనే 50% మార్కులు కొట్టేసింది. ఎందుకంటే సూపర్ హిట్ అయిన టైటిల్ ను ఈ సినిమాకు పెట్టడం వలన ప్రజల్లోకి ఈజీగా వెళుతుంది. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్సట్రార్దినరీ ఉంది. ఇది డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రెయిట్ సినిమా అనిపించేలా ఉంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఇకపోతే రవీందర్ కనెక్టింగ్ పీపుల్ అన్నట్టు ఎక్కడ మంచి సినిమాలు ఉన్నా వాటిని కలెక్ట్ చేసి తెలుగు ప్రేక్షకులకు చూపిస్తుంటాడు. అశోక్ గతంలో అద్భుతమైన మంచి సినిమా తీశాడు. రియల్ ఎస్టేట్ లో విజయం సాధించినట్లే ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప విజయం సాదించాలి.గతంలో కూడా మూవీ మాక్స్ శ్రీనివాస్ గారు నా సినిమాలు రిలీజ్ చేశారు. తనకు థియేటర్స్ గురించి బాగా తెలుసు తను కూడా వీరికి సపోర్ట్ చేస్తూ నైజాంలో రిలీజ్ చేస్తున్నాడు. అదే రోజు విడుదల అవుతున్న తీస్ మార్ ఖాన్ సినిమా నిర్మాత తిరుపతి రెడ్డి గారు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది .ప్రస్తుతం సినిమాలు హిట్ అవ్వాలని జూనియర్ యన్టీఆర్ సినిమాకు మహేష్ బాబు వచ్చి సక్సెస్ కావాలని ఎలా కోరుకుంటాడో అలాంటి అన్నోన్యత మా నిర్మాతల్లో కూడా ఉండాలని కోరుకొంటున్నాను. కన్నడలో ఈ సినిమా మంచి హిట్ అయ్యి 49 కోట్లు కలెక్ట్ చేసింది తెలుగులో కూడా అంతే విజయం సాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత బొడ్డు ఆదిత్య మాట్లాడుతూ..తెలుగు ట్రైలర్ చాలా అద్భుతంగా వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన పుష్పరాజ్ సినిమాను తెలుగులో డబ్ చేసే అవకాశం కల్పించిన రవీంద్ర కళ్యాణ్ గారికి ధన్యవాదములు.అలాగే మూవీ మాక్స్ ద్వారా మా సినిమాను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆగష్టు 27 న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మా సినిమాను అందరూ ఆశీర్వదించాలి. అలాగే మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న తిరుపతి రెడ్డి గారి సినిమా తీస్ మార్ ఖాన్ సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

మూవీ మాక్స్ ఆధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీడెడ్, వైజాగ్ ఏరియా లలో బిజినెస్ అయ్యింది. ఇంతకుముందు వచ్చిన పొగరు సినిమాలాగే ఇప్పుడు వస్తున్న “పుష్పరాజ్” సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

రేణుక మాట్లాడుతూ.. కన్నడలో హిట్ అయినట్లే తెలుగులో కూడా పుష్పరాజ్ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

డైలాగ్ రైటర్ సూర్య మాట్లాడుతూ. ఇందులో డైలాగ్స్, పాటలు, ఫైట్స్ అన్నీ బాగుంటాయి..చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ చూడవలసిన చిత్రమిది . నాకిలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదములు

పుప్పా అంకంబరావు మాట్లాడుతూ.. బొడ్డు అశోక్, కె. రవీంద్ర కళ్యాణ్ లు సంయుక్తంగా తెలుగులోకి విడుదల చేస్తున్న పుష్పరాజ్ బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

గౌతమ్, రాహుల్, రామకృష్ణ మరియు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.తదితరులు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dhruv sarja
  • #Pushpa Raj

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version