Pushpa: సైమా అవార్డ్స్ లో దుమ్ము లేపిన పుష్ప.. ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే?

  • September 11, 2022 / 10:36 PM IST

సైమా 2022అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని బెంగళూరు సిటీలో ఎంతో ఘనంగా నిర్వహించారు. సైమా అవార్డుల కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున తెలుగు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. రెండు రోజులపాటు జరుగునున్న ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ అవార్డు వేడుకలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు చిత్రాలు నామినేషన్స్ లో ఉన్నాయి.

తెలుగు సినిమాల విషయానికొస్తే పుష్ప, అఖండ, ఉప్పెన, జాతి రత్నాలు వంటి సినిమాలు సైమా నామినేషన్స్ లో ఉన్నాయి. ఇక ఈ సైమా అవార్డు వేడుకలలో భాగంగా పుష్ప సినిమా అన్ని కేటగిరీలలో అవార్డులను అందుకొని రికార్డు సృష్టించింది. ఈ సినిమా మొత్తం ఆరు క్యాటగిరిలలో అవార్డులను సొంతం చేసుకుంది.

పుష్ప సినిమా సైమా అవార్డులలో భాగంగా ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సాహిత్య రచయిత, ఉత్తమ చిత్రం ఇలా ఈ ఆరు కేటగిరీలలో ఈ సినిమా అవార్డులను అందుకోవడం విశేషం. ఇక ఈ వేడుకలో భాగంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకుంటూ తనదైన స్టైల్ లో వేదికపై తగ్గేదేలే అంటూ వేదికపై సిగ్నేచర్ మూమెంట్ చేసినటువంటి పిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ విధంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతోపాటు ఈయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇలా రెండుసార్లు ఉత్తమ నటుడుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలా రెండుసార్లు అవార్డు రావడం చాలా అరుదైన ఘనతగా తాను భావిస్తున్నానని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా పుష్ప సినిమాకు ఏ విధంగా 6 కేటగిరీలలో అవార్డు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus