PVT4: సంక్రాంతి బరిలో వైష్ణవ్ తేజ్ సినిమా!

  • June 22, 2022 / 07:06 PM IST

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరారు. రెండో సినిమా క్రిష్ దర్శకత్వంలో చేశారు. కానీ వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కొండపొలం’ సరిగ్గా ఆడలేదు. త్వరలోనే అతడు ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈలోగా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ ‘ఫార్ట్యూన్ 4’ కూడా ఇందులో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. వైష్ణవ్ తేజ్ గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఊరమాస్ గా చిత్రీకరిస్తున్నారు. వయిలెన్స్, యాక్షన్ ఓ రేంజ్ లో ఉండబోతుందని ఈరోజు విడుదల చేసిన వీడియోలో డైలాగ్స్ వింటుంటే అర్ధమవుతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో నాటుగా ఉండే సినిమా అని తెలుస్తోంది.

‘తలలు కోసి సేతికిస్తా నా యాలా.. సూస్కుందాం రా’ అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. కేవలం డైలాగ్స్ తోనే సినిమా మీద అంచనాలను పెంచడంలో చిత్రబృందం సక్సెస్ అయిందనే చెప్పాలి. సినిమా ఫస్ట్ గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. 2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. మాములుగా అయితే సంక్రాంతి బరిలో భారీ సినిమాలే పోటీ పడతాయి.

వచ్చే సంక్రాంతికి ప్రభాస్ ‘ఆదిపురుష్’తో పాటు రామ్ చరణ్-శంకర్ ల సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి భారీ సినిమాలు ఉండగా.. వాటికి పోటీగా వైష్ణవ్ తేజ్ సినిమాను పోటీలో నిలపాలనుకోవడం సాహసమే. పైగా ఇది పండక్కి సూటయ్యే ఫ్యామిలీ సినిమా కూడా కాదు. మరి ఇంత కాన్ఫిడెంట్ గా భారీ సినిమాలకు పోటీగా దింపాలనుకోవడం ఏంటో..? సాయి సౌజన్య అనే లేడీ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. గతంలో ఈమె ‘వరుడు కావలెను’ అనే సినిమా తీశారు. ఇప్పుడు మాస్ కాన్సెప్ట్ ను ఎన్నుకున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus