బాలీవుడ్ లో కంగనా రనౌత్ చేసిన క్వీన్ ని దక్షిణాది అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ లో క్వీన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా, తమిళంలో కాజల్ అగర్వాల్, కన్నడ లో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమ మోహన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలకు రమేష్ డైరక్టర్ గా వ్యవహరిస్తుండాగా మలయాళం వెర్షన్ ని మాత్రం నీలకంఠ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా గత షెడ్యూల్ మైసూర్ లో జరిగింది. అక్కడ కొన్ని సన్నివేశాలతో పాటు బటర్ ఫ్లై సాంగ్ ని చిత్రీకరించారు.
పెళ్లి వేడుకలో వచ్చే ఈ సాంగ్ చాలా అందంగా వచ్చిందని సమాచారం. దీంతో 80 శాతం షూటింగ్ పూర్తి అయింది. ఇప్పుడు చివరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం యూరప్ వెళ్లడానికి ప్లాన్ చేస్తోంది. గతఏడాది పారిస్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు మిగిలిన సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారు. తిరిగి వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అమిత్ త్రివేది సంగీతమందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత తమన్నా కెరీర్ నెమ్మదించింది. ఈ క్వీన్ చిత్రంతో మళ్ళీ ఫామ్లోకి రావాలని తమన్నా కష్టపడుతోంది.