“రత్తాలు”గా ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి పక్కన తళుక్కున మెరిసిన లక్ష్మీ రాయ్ అలియాస్ రాయ్ లక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు చూస్తున్న యువకులందరూ ఘోల్లుమంటున్నారు. నిన్నమొన్నటివరకూ ఆమె బొద్దు అందాలు చూసి తెగ సంతోషపడిపోయిన వాళ్ళందరూ.. ఇప్పుడు ఆమె మరీ నాజూగ్గా అయిపోవడంతో ఇదేంటి లక్ష్మీ మరీ ఇంత సన్నగా అయిపోయిందని బాధపడడమే కాదు ఆమె పెట్టిన ప్రతి పోస్ట్ కి కింద “ప్లీజ్ ఇంక సన్నబడకు” అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఆమె తాజాగా బాలీవుడ్ లో “జూలీ 2” అనే సినిమాలో నటించి, ఆ చిత్రం కోసం తన అంగాంగలను ప్రదర్శించి భారీ డిజాస్టర్ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే.
అయితే.. ఆ సినిమా కోసం సన్నబడిన రాయ్ లక్ష్మిని సన్నగా ఉండడం నచ్చిందో లేక సన్నగా ఉంటేనే బాలీవుడ్ లో ఆఫర్లు వస్తాయనే రూమర్ ను నమ్మిందో తెలియదు కానీ.. రోజురోజుకీ మరీ చిక్కిపోతుంది. మరి అమ్మడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి.